సమంత మయోసైటిస్ ‘శాకుంతలం’ని కాపాడుతుందా.?

సమంత లీడ్ రోల్ పోషిస్తున్న ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్ల హోరు నడుస్తోంది. అయితే, సమంత అనారోగ్యం చుట్టూనే ఈ సినిమా ప్రమోషన్లు జరుగుతున్నాయ్. దాంతో బాగా సింపతీ వర్కవుట్ అయ్యింది ఈ సినిమాకి.

రిలీజ్‌కి రెండు రోజుల ముందు కూడా జ్వరం కారణంగా సమంత కొన్ని ప్రమోషన్లకు దూరంగా వుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సహా, పలువురు సినీ ప్రముఖులు సమంత తేరుకోవాలని సోషల్ మీడియాలో ట్వీట్స్ వేశారు.

ఈ సింపతీ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. ఒక్కసారిగా ‘శాకుంతలం’పై బజ్ పెరిగింది. బజ్ అయితే పెరిగింది కానీ, సినిమాకి ఆశించిన రేంజ్‌లో టాక్ రాలేదనీ తెలుస్తోంది.

ఆల్రెడీ ప్రీమియర్ షోల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం, సినిమా టాక్ ఏమంత పాజిటివ్‌గా లేదనీ తెలుస్తోంది. నిజమే, ఈ సినిమా కోసం సమంత బాగా కష్టపడింది. అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కష్టపడింది.

కానీ, ఎంత సింపతీ ట్రైల్స్ వేసినా, సినిమా నచ్చితేనే కదా.. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేది. ఆశించిన కంటెంట్ వుంటేనే కదా.. సినిమాకి పట్టం కట్టేది. సమంత ‘శాకుంతలం’‌ను ప్రేక్షకులు తమ భుజాలపై మోస్తారో లేదో చూడాలి మరి.