“నా సామిరంగ”.. మొత్తం నాగార్జునే అట..!

టాలీవుడ్ సినిమా దగ్గర రానున్న సంక్రాంతి మహోత్సవం కానుకగా అయితే పలు అవైటెడ్ చిత్రాలు రాబోతున్న సంగతి విదితమే. కాగా ఈ చిత్రాల్లో గత రెండు సంక్రాంతి సీజన్లలో హిట్స్ అందుకున్న కింగ్ నాగార్జున మళ్ళీ హిట్ కొట్టాలని వస్తున్నా చిత్రం “నా సామిరంగ” కూడా ఒకటి.

కాగా ఈ చిత్రం కూడా ఒక మాస్ అండ్ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతూ ఉండగా ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఈ జనవరి 14 రిలీజ్ కి వచ్చే ప్లానింగ్ లలో ఉంది. కాగా ఈ చిత్రం నాగార్జున కెరీర్ 99వ సినిమా కావడం..

పైగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోని సినిమానే కావడంతో ఫ్యామిలీస్ లో మళ్ళీ మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కినేని నాగార్జునే కొనుగోలు చేసుకొని రిలీజ్ చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో అన్నీ వర్కౌట్ అయ్యి సినిమా కానీ హిట్ కొడితే మాత్రం నాగరాజును జాక్ పాట్ కొట్టినట్టే అని చెప్పాలి.

దీనితో మొత్తం నాగార్జునే చూసుకోనున్నాడని చెప్పాలి. ఇంకా ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆషిక రంగనాథ్ నటిస్తుండగా హీరోస్ అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ లు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా వస్తున్నా ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.