వైరల్ : నాగార్జున సినిమాని అవమానించిన టాప్ ప్రొడ్యూసర్?

తెలుగు సినిమా దగ్గర సంక్రాంతి వస్తుంది అంటేనే ఒకరకమైన కొత్త ఉత్సాహం మూవీ లవర్స్ లో వస్తుంది. కాగా ఈ రేస్ లో టాలీవుడ్ నుంచి పలు చిత్రాలు రిలీజ్ కి రాగ ఈరోజు జనవరి 12నే రెండు సినిమాలు వచ్చేసాయి. కాగా ఈ చిత్రాల్లో ఒకటి హనుమాన్ అయితే మరొకటి గుంటూరు కారం.

మరి ఈ రెండు సినిమాల్లో ఏది పెద్ద సినిమా అంటే టెక్నీకల్ గా గుంటూరు కారం అనే చెప్పవచ్చు. అయితే ఈ రెదను సినిమాలు క్లాష్ మూలాన హనుమాన్ కే నష్టం వచ్చింది అని థియేటర్స్ హనుమాన్ కి సరిగ్గా రాలేదు అని ఈ కొన్ని రోజులు అంతా కూడా చాలా రచ్చ నడిచింది.

కాగా నిన్న రిలీజ్ వరకు కూడా పలు థియేటర్స్ లో ఇష్యూస్ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ లో గొడవలు అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. కాగా వీటిలో ఈ జనవరి 14న వస్తున్నా సినిమా అక్కినేని నాగార్జున నటించిన “నా సామిరంగ” కి మాత్రం అవమానం జరిగింది అని ఓ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది.

గుంటూరు కారం, హనుమాన్ ల పోటీపై గుంటూరు కారం డిస్ట్రిబ్యూటర్ శిరీష్(దిల్ రారాజు సోదరుడు) మాట్లాడుతూ హనుమాన్ ఎలా పెద్ద సినిమా అవుతుంది అని అది గుంటూరు కారంతో పోల్చడం కరెక్ట్ కాదు కావాలంటే నాగార్జున నటించిన నా సామిరంగ తో పోల్చుకోండి అని హితవు పలికారట. దీనితో ఆ సినిమాని తగ్గించడానికి నాగ్ సినిమాని ఇలా తక్కువ చేసి మాట్లాడాలా అంటూ అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో కొంతమంది బాధపడుతున్నారు కూడా.