మనం ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది గూగుల్ సెర్చ్. వయసుతో సంబంధం లేకుండా ఎవరికి ఏ విషయం గురించి సమాచారం కావాలన్నా గూగుల్ పైనే ఆధారపడుతూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం ఏ టాపిక్ గురించి ఎక్కువ వెతికారు ఎవరు, ఏ సినిమా స్టార్ గురించి ఎక్కువ వెతికారు అని గూగుల్ ఒక జాబితా ని విడుదల చేస్తుంది.
అలాగే 2024 కి సంబంధించిన జాబితా గూగుల్ విడుదల చేసింది. ఈ సంవత్సరం గూగుల్ లో గ్లోబల్ లెవెల్ లో అత్యధికంగా వెతికిన సినీ నటుల జాబితాలో పవన్ కళ్యాణ్ ఏకంగా వరల్డ్ వైడ్ గా టాప్ 2 స్థానంలో నిలబడటం విశేషం. టాప్ 1 స్థానాన్ని క్యాట్ విలియమ్స్ దక్కించుకోగా రెండవ స్థానాన్ని పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు విశేషంగా కృషి చేసిన నాయకుడిగా పవన్ ఇమేజ్ ఈ సంవత్సరం అమాంతం పెరిగిపోయింది.
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సత్తా ఏమిటో అందరికీ తెలిసిందే, అలాగే ఎన్నికల ద్వారా నేషనల్ లెవెల్ లో కూడా తన సత్తా చూపించారు పవన్ కళ్యాణ్. ఎలాంటి పాన్ ఇండియా సినిమా లేకుండా మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభ పెడితే పవన్ కళ్యాణ్ కోసం భారీగా జన ప్రవాహం హాజరైంది అంటేనే ఆయన క్రేజ్ ఏమిటో అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే పవన్ కళ్యాణ్ టాప్ 2 స్థానంలో నిలబడటంతో పవన్ అభిమానులు గాల్లో తేలిపోతున్నారు పవన్ అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ బ్రాండ్ అంటూ తొడ కొడుతున్నారు.
ప్రస్తుతం పవన్ తన కొత్త సినిమా హరిహర వీరమల్లుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఇంకో పక్క ఓజీ షూటింగ్ కూడా పూర్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా మార్కెట్ పరంగా ముందంజలో ఉన్న రజనీకాంత్, ప్రభాస్, షారుక్ ఖాన్, విజయ్ లాంటి వాళ్ళని కాదని పవన్ కళ్యాణ్ గురించి గ్లోబల్ వైడ్ గా పవన్ కళ్యాణ్ గురించి సెర్చ్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
