బాలకృష్ణ క్రేజ్ ఏంటో .. యంగ్ హీరోలకే పిచ్చెక్కిపోతోంది..!

బాలకృష్ణ క్రేజ్ కి టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా షాకవుతున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అందుకు కారణం ఆయన దూకుడు గా సినిమాలని పట్టాలెక్కిస్తుండటమే. వరసగా ఫ్లాప్స్ వచ్చాయి. అయినా బాలకృష్ణ క్రేజ్ తగ్గడం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు బాలయ్య. మిరియాల రవీందర్ రెడ్డి ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. హాట్ బ్యూటీస్ ప్రగ్యా జైస్వాల్ – పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా మోనార్క్ అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 28 న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు. దాంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే బోయపాటి శ్రీను బాలయ్యతో సింహ, లెజెండ్ తీసి భారీ కమర్షియల్ హిట్స్ ఇచ్చాడు. అదే విధంగా బాలయ్య – బోయపాటి మరోసారి హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నారని గట్టిగా చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.

కాగా ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే బాలయ్య చేయబోయో నెక్స్ట్ సినిమా గురించి తాజాగా అప్‌డేట్ వచ్చింది. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ బాలయ్య సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఏప్రిల్ వరకు పూర్తి స్క్రిప్ట్ రెడి అవుతుందట. మే నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంతేకాదు ఈ ఏడాదే బాలయ్య మరో ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయబోతున్నాడట. త్వరలో ఆ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.