బ్రేకింగ్ : దిల్ రాజు ఇంట పండుగ..మగ బిడ్డకి తండ్రి అయ్యిన దిల్ రాజు.!

Dil raju

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఉన్నటువంటి స్టార్ ప్రొడ్యూసర్స్ లో నిర్మాత దిల్ రాజు కూడా ఒకరు. అయితే దిల్ రాజు తన కెరీర్ లో మోస్ట్ సక్సెస్ లను చూసారు. భారీ లాభాలు హిట్ సినిమాలతో తెలుగు సినిమా దగ్గర ఒక వెలుగు వెలుగుతూ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాలు నిర్మించే స్థాయిలోకి తాను ఎదిగాడు. 

అయితే దిల్ రాజు కెరీర్ లో ప్రొఫిషనల్ గా ఎలాంటి డోకా లేదు కానీ పర్శనల్ లైఫ్ లో మాత్రం గత కొన్నేళ్ల కిందట తన భార్య ఆకస్మిక మరణం తనని డైలమాలో పడేసింది. అయితే తర్వాత కుటుంబీకుల సూచన మేరకు తాను తేజస్విని అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. 

ఈ 2020 లోనే దిల్ రాజు ఈ వివాహం జరుపుకోగా ఇప్పుడు దిల్ రాజు ఇంట పండుగ వచ్చినట్టు అయ్యిందని చెప్పాలి. తాజాగా ఈ భార్య భర్తలు ఇద్దరూ ఓ మెగా బిడ్డకి జన్మనిచ్చినట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేశారు.

ఈరోజు హైదరాబాద్ ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో డెలివరీ జరిగి వీరు తల్లిదండ్రులు అయ్యారు. ప్రస్తుతం బిడ్డ తేజస్విని ఆరోగ్యంగానే ఉన్నారట. దీనితో ఈ గుడ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.