లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఖైదీ 2కే స్పెషల్ హైప్ ఉంది. కార్తి కెరీర్‌లో బెస్ట్ క్రిటికల్ హిట్ అయిన ఖైదీకి కొనసాగింపుగా తెరకెక్కబోతున్న ఈ సీక్వెల్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో దూసుకెళ్తోంది. రజినీకాంత్‌తో కూలీ పూర్తయ్యాక లోకేష్ ఖైదీ 2పై ఫోకస్ పెంచనున్నాడు. అయితే ఈ సారి మాత్రం ఖైదీ యూనివర్స్‌కు విస్తృత రూపం ఇవ్వాలని డైరెక్టర్ మైండ్‌లో భారీ స్కెచ్ సిద్ధమవుతోంది.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, లోకేష్ ఖైదీ 2లో ఒక టాలీవుడ్ స్టార్ హీరోను సీక్రెట్ రోల్ కోసం ఫైనల్ చేశారట. గతంలో విక్రమ్లో సూర్య క్యామియో రేంజ్ ఎలా దాటి పోయిందో, ఖైదీ 2లో కూడా అలాంటి మేజర్ మునుపటి లింక్ ఉండబోతోందట. ఈ పాత్రే సినిమాకే కొత్త షేడ్ ఇవ్వబోతోందని టాక్. ఇంకో వైపు, కూలీలో నాగార్జున ఎంట్రీ తీసుకున్న ఫార్ములానే ఖైదీ 2లోనూ వర్తించనున్నట్లు సమాచారం. దాంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా, తెలుగు స్టార్‌ను తీసుకునే యోచనలో ఉన్నారు.
ఇక ఈ వార్తలతో ఫ్యాన్స్ ఊహాగానాల్లో మునిగిపోతున్నారు. రామ్ చరణ్, నాని, రానా వంటి పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కార్తి రీసెంట్‌గా హిట్ 3లో కనిపించడంతో, హిట్ యూనివర్స్-లోకేష్ యూనివర్స్ కలయిక జరిగే సూచనలు కూడా వినిపిస్తున్నాయి. ఖైదీ 2తో మల్టీస్టారర్ కాన్సెప్ట్ కొత్త ఎత్తుకు చేరబోతోంది. పాన్ ఇండియా లెవెల్‌లో అంచనాలు పెంచేలా లోకేష్ ప్లాన్ చేస్తున్న ఈ కాంబినేషన్ ఎప్పుడు అఫీషియల్ అవుతుందో చూడాలి.