బండ్లన్నరెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న వండ్ల గణేష్ మొదట కమెడియన్ గా ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభించాడు. కమెడియన్ గా చాలా సినిమాలలో నటించిన బండ్ల గణేష్ అందరికీ షాక్ ఇస్తూ ప్రొడ్యూసర్ గా మారి పెద్ద సినిమాలను నిర్మించి హిట్ అందుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ సినిమాలను నిర్మించటం లేదు. ఇలా నటుడిగా నిర్మాతగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న బండ్ల గణేష్ రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి అక్కడ నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ బండ్ల గణేష్ ఊహించినట్టుగా రాజకీయాలు అతనికి వర్కౌట్ కాలేదు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ తరచూ వివాదాస్పదమైన ట్వీట్ లు చేస్తూ ఉంటాడు. బండ్ల గణేష్ అంటేనే పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని గుర్తొస్తుంది. ఇంతకాలం పవన్ కళ్యాణ్ నా దేవుడు నా సర్వస్వమని పొగిడిన బండ్ల గణేష్ కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఊసు ఎత్తటం లేదు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరిగిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా బండ్ల గణేష్ గురించి మరొక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఒక సినిమాకి డబ్బింగ్ చెప్పటం కోసం బండ్ల గణేష్ ఏకంగా ఒక రోజుకి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.

రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా షూటింగ్ పనులు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో తొట్టెంపూడి వేణు కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో వేణు పాత్రకి డబ్బింగ్ చెప్పటం కోసం సినిమా డైరెక్టర్ శరత్ మండవ బండ్ల గణేష్ ని సంప్రదించినట్లు సమాచారం. ఒక్కరోజు డబ్బింగ్ కోసం బండ్ల గణేష్ అడిగిన రేమ్యూనరేషన్ విని డైరెక్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడట. తొట్టెంపూడి వేణుకి డబ్బింగ్ చెప్పడం కోసం బండ్ల గణేష్ ఒక రోజుకి ఏకంగా ఐదు లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో షాక్ అవడం డైరెక్టర్ వంతు అయింది. అయితే వేణు తొట్టెంపుడికి బండ్ల గణేష్ వాయిస్ సెట్ అవ్వదని, డైరెక్టర్ ఎందుకలా ఆలోచించాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.