లేటెస్ట్ : “భోళా శంకర్” ట్రైలర్ కోసం టాలీవుడ్ మోస్ట్ లక్కీ హ్యాండ్.!

ఇక ఈ జూలై నుంచి అయితే ఒకో పెద్ద సినిమా నెక్స్ట్ వచ్చే ప్రతి నెల నుంచి టాలీవుడ్ సహా సౌత్ ఇండియా నుంచి వస్తూ సందడి చేయనున్నాయి. ఇప్పుడు జూలై మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల బ్రో చిత్రాలు రాబోతుండగా నెక్స్ట్ అయితే ఆగస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సాలిడ్ చిత్రం “భోళా శంకర్” ఇప్పుడు రాబోతుంది.

మరి దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ సినిమా “భోళా శంకర్” కి అయితే రీమేక్ గా తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రం ట్రైలర్ ని మేకర్స్ ఈ జూలై 27న లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా ఈ ట్రైలర్ పై మేకర్స్ మరో సూపర్ న్యూస్ ని ఐతే అందించారు.

కాగా దీనితో ఈ చిత్రం ట్రైలర్ ని మన టాలీవుడ్ లో మోస్ట్ లక్కీ హ్యాండ్ అయినటువంటి మెగా వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో లాంచ్ చేయిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే రామ్ చరణ్ లాంచ్ చేసిన ప్రతి సినిమా ట్రైలర్ కూడా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కూడా చాలా చిత్రాలు భారీ సక్సెస్ లు అందుకున్నాయి.

మరి వాటిలో “విక్రమ్”, “కేజీఎఫ్ 2” లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. సో దీనితో రామ్ చరణ్ హ్యాండ్ తో రీమేక్ అయ్యిన భోళా శంకర్ కి కూడా ఏమన్నా కలిసి వస్తుందో లేదో అనేది చూడాలి మరి. కాగా ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా తమన్నా హీరోయిన్ గా కీర్తి సురేష్ చిరు కి చెల్లెలి పాత్రలో నటిస్తుంది.