హృతిక్ రోషన్ కోసం ట్రై చేస్తున్న టాలీవుడ్ డైరెక్టర్.!

ఆయనో తెలుగు సినీ దర్శకుడు.! పెద్దగా అనుభవం ఏమీ లేదు. కాకపోతే, ఇటీవలే ఓ హిట్టు కొట్టేశాడు. దానికి జాతీయ స్థాయిలో ప్రశంసలూ దక్కాయ్.! అంతే, ఆ దర్శకుడ్ని వెంటేసుకుని.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో సినిమా కోసం ముంబైలో ప్రయత్నాలు ప్రారంభించింది ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ. టాలీవుడ్ నిర్మాణ సంస్థే అయినా, బాలీవుడ్‌లోనూ బాగానే పరిచయాలున్నాయ్.. ఆ బ్యానర్ నడుపుతున్న నిర్మాతకి.

ప్చ్.. హృతిక్ రోషన్ అపాయింట్మెంట్ అయితే దొరకలేదట. దాంతో, ఒకింత నిరాశ చెందాడట ఆ యువ దర్శకుడు. కానీ, హృతిక్ టైమ్ ఇస్తే.. ఖచ్చితంగా ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలున్నాయ్.

హృతిక్ కూడా టాలీవుడ్‌తో ‘టై-అప్’ అయ్యే ప్రయత్నాల్లోనే వున్నాడు. ‘వార్-2’ సినిమాని ఎన్టీయార్‌తో కలిసి చేస్తున్నాడు కదా హృతిక్.!