ఆ రీమేక్ సినిమాల కోసం పోటీ పడుతున్న టాలివుడ్ బడా ప్రొడ్యూసర్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్లుగా గుర్తింపు పొందిన వారిలో అల్లు అరవింద్ , దిల్ రాజు మొదటి స్థానంలో ఉన్నారని చెప్పటంలో సందేహం లేదు. వీరిద్దరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా తక్కువ బడ్జెట్ సినిమాల నుండి భారీ బడ్జెట్ సినిమాల వరకు అన్ని రకాల సినిమాలను నిర్మిస్తూ ప్రొడ్యూసర్లుగా మంచి గుర్తింపు పొందారు. అల్లు అరవింద్ తన సొంత బ్యానర్ పై వరుస సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక చిన్న సినిమాలతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు కూడా దిల్ రాజు చేతిలో ఉన్నాయి.

తాజాగా వీరిద్దరూ థియేటర్ల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అదికూడా వీరి నిర్మాణ సంస్థలో నిర్మించిన సినిమాల కోసం కాకుండా డబ్బింగ్ సినిమాల కోసం వీరిద్దరూ పోటీపడుతున్నట్లు సమాచారం. అల్లు అరవింద్ ప్రస్తుతం తమిళ్ హీరో ధనుష్ నటించిన
‘ నేనే వస్తున్నా ‘ అనే సినిమాని తెలుగులో విడుదల చేయనున్నారు. ధనుష్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో విడుదలై మంచి వసూళ్లు సాధించాయి. అందువల్ల టాలీవుడ్ లో ధనుష్ కి మంచి మార్కెట్ ఉండటంతో అల్లు అరవింద్ ఆ సినిమాని సెప్టెంబర్ 29వ తేదీన తెలుగులో విడుదల చేయనున్నాడు.

ఇక దిల్ రాజు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన తమిళ సినిమాని తెలుగులో విడుదల చేయనున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో చాలా కాలం తర్వాత విజువల్ వండర్ గా తెరకెక్కిన `పొన్నియిన్‌ సెల్వన్‌ 1` సినిమాని తెలుగులో దిల్ రాజు విడుదల చేయనున్నారు. మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో కార్తీ, విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష వంటి ప్రముఖులు నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కానుంది. టాలీవుడ్ లో వడ నిర్మాతలుగా పేరుపొందిన అల్లు అరవింద్ దిల్ రాజు ఈ రెండు సినిమాలను తెలుగులో విడుదల చేయనున్నారు. అయితే ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ తో విడుదల అవుతున్నాయి. అందువల్ల వీరిద్దరూ తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ కోసం ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు సమాచారం.