టాలీవుడ్ బడా నిర్మాతల్లో సమంతకి ఇంతటి పేరుందా.!

తెలుగు సినిమా సహా సౌత్ ఇండియా సినిమా దగ్గర కూడా భారీ మార్కెట్ ఉన్న హీరోలు చాలా మంది ఉండొచ్చు కానీ బాక్సాఫీస్ దగ్గర మంచి పట్టుతో మార్కెట్ ఉన్న హీరోయిన్స్ చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. మరి అలాంటి హీరోయిన్స్ లో స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మొదటి స్థానములో అయితే ఉందని చెప్పడంలో సందేహమే లేదు.

ఇక ఇప్పుడు సమంత నటిగా అంచలెంచలు వెళ్తుండగా మన టాలీవుడ్ లో ఉన్నటువంటి దిగ్గజ నిర్మాతలు అయినటువంటి సురేష్ బాబు మరియు అల్లు అరవింద్ లు సమంత కోసం ఒకే మాట చెప్పడం వైరల్ గా మారింది. ఈ బడా నిర్మాతలు బాలయ్య షోలో అయితే ఈ ఇద్దరినీ ప్రస్తుత జెనరేషన్ లో “మహానటి” అనే టాగ్ ఎవరికి ఇస్తారు అని అడగ్గా ఒకరికొకరు తెలియకుండా సమంత పేరునే వారు కామన్ గా రాయడం విశేషం గా మారింది.

దీనితో ఇక ప్రస్తుత జెనరేషన్ లో సావిత్రి అంటే సమంతానే అనే టాక్ మంచి వైరల్ గా ఇప్పుడు మారిపోయింది. అలాగే ఈ క్లిప్ లు వైరల్ గా మారింది. ఇక రీసెంట్ గా అయితే సమంత యశోద అనే సినిమాతో భారీ హిట్ అందుకోగా నెక్స్ట్ శాకుంతలం అనే భారీ పాన్ ఇండై సినిమా చేస్తుంది.