అలాంటి సినిమా తీయాలంటే రెండు పడవలపై ప్రయాణం చేసినట్లే: ఎస్ ఎస్ రాజమౌళి

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడిగా గుర్తింపు పొందిన దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా దగ్గరినుండి ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు రాజమౌళి దర్శకత్వం వహించిన ఒక్క సినిమా కూడా లాఫ్ అవ్వలేదు అంటే ఆయన దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని రూ .1000 కోట్లను వసూలు చేసి మన తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేసింది.

అయితే దర్శకుడి గా రాజమౌళి ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటాడు. స్టార్ డైరెక్టర్ అన్న గర్వం ఏమాత్రం లేకుండా ఎప్పుడు నేనొక విద్యార్థిగానే ఉంటానని చెబుతూ ఉంటాడు. ఇటీవల రాజమౌళి టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి హాజరై మీడియాతో ముఖాముఖి గా ముచ్చటించారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమా విజయానికి సంబంధించిన విశేషాలతో పాటు మరికొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. తాను దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినప్పటికీ నేను ఇంకా నేర్చుకుంటూ నన్ను నేను నిరంతం చక్కదిద్దుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు.

ఇక ఈ సమావేశంలో యువదర్షకులకు మీరు ఏమని మార్గదర్శం చూపుతారు అని అడగ్గా.. ఇప్పటికీ నేను నేర్చుకోవలసింది చాలా ఉంది. అందువల్ల నేనెవరికీ మార్గదర్శకుడు కాలేను అంటూ రాజమౌళి సమధానం ఇచ్చాడు. ఇక నా స్టైల్ కథనంతో పాశ్చాత్య ధోరణిలో సాగే సినిమా తీయాలంటే రెండు పడవల మీద ప్రయాణం చేసినట్టు అవుతుంది. ఆ ప్రయాణం చాలా ప్రమాదం అని చెప్పుకొచ్చాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. అడ్వెంచర్స్ థ్రిల్లర్ గా.. భారీ వ్యయంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు రాజమౌళి వెల్లడించారు.