వసూళ్లతో మరోసారి ఆశ్యర్యపరుస్తున్న “టైటానిక్”.!

వరల్డ్ సినిమా దగ్గర హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాలు ఏదన్నా ఉన్నాయి అంటే అవి డెఫినెట్ గా దర్శకుడు జేమ్స్ కామెరాన్ పేరు మీదే ఉంటాయి. గత ఏడాది తన నుంచి వచ్చిన సినిమా “అవతార్ ది వే ఆఫ్ వాటర్” ఇప్పుడు వరల్డ్ వైడ్ టాప్ 3 లోకి వచ్చేసింది. కాగా ఈ సినిమా టాప్ 3 లోకి కూడా జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి లలో ఒకటి అయినటువంటి బిగ్గెస్ట్ హిట్ “టైటానిక్” సినిమాని దాటి వచ్చింది.

అయితే టైటానిక్ సినిమాని ఇప్పుడు సినిమా దాటడం అసలు పెద్ద విషయం కాదు అని చెప్పాలి. కానీ టైటానిక్ లాంటి హిట్ అవ్వాలి అంటే ఇప్పుడు హాలీవుడ్ టాప్ ఛార్ట్స్ లో ఉన్న ఏ సినిమాకి కూడా సాధ్యం కాదని చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో ఉన్న తక్కువ స్క్రీన్ లు ఉన్న టికెట్ ధరలకు అప్పటి రికార్డులను ఇప్పుడు సినిమాలు బ్రేక్ చెయ్యడం అనేది టైటానిక్ సక్సెస్ ముందు చాలా చిన్నవి.

అంటే ఈ సినిమా ఎంత రేంజ్ హిట్ అయ్యిందో మనం అర్ధం చేసుకోవాలి. కాగా ఈ సినిమా మళ్ళీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈ సందర్భంగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమాకి యూఎస్ లో మళ్ళీ మైండ్ బ్లాకింగ్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ ఫిబ్రవరి 11 న రిలీజ్ అయ్యిన ఈ చిత్రం యూఎస్ లో అప్పుడే 5 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసింది.

దీని బట్టి మళ్ళీ రీ రిలీజ్ లో కూడా అదరగొడుతుంది అని చెప్పాలి. కాగా ఈ సినిమా ఇండియాలో కూడా  భారీ గా రిలీజ్ కాగా మరోసారి టైటానిక్ మ్యాజిక్ లో అయితే మనవాళ్ళు మునుగుతున్నారు. మరి ఈ సినిమాలో లెజెండరీ హీరో లియోనార్డో డికాప్రియో హీరోగా నటించగా కేట్ విన్స్లెట్ హీరోయిన్ గా నటించింది.