“ఇండియన్ 2” ట్రీట్ కి టైం ఖరారు..రిలీజ్ చేస్తున్న దిగ్గజాలు వీరే 

ఇప్పుడు తమిళ సినిమా నుంచి రాబోతున్న రోజుల్లో పలు భారీ చిత్రాలు ఉండగా వాటిలో ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన మాసివ్ పాన్ ఇండియా సినిమా “ఇండియన్ 2” కూడా ఒకటి. మరి ఈ భారీ చిత్రం కోసం ఎంతో అంచనాలు నెలకొనగా ఈ సినిమా అయితే దాదాపు 20 ఏళ్ల కితం వచ్చిన ఇండియన్ కి సీక్వెల్ గా వస్తుండగా ఇప్పుడు సినిమాపై మరిన్ని అంచనాలు అయితే పెరుగుతూ వస్తున్నాయి.

కాగా ఈ భారీ చిత్రం నుంచి మేకర్స్ రేపు నవంబర్ 3న అయితే మొట్టమొదటి గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ ని ముందు లాక్ చేయగా ఇప్పుడు అయితే టైం ని కూడా అనౌన్స్ చేసేసారు. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ గ్లింప్స్ ఇంట్రో రేపు సాయంత్రం ఐదున్నర గంటలకి విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు.

కాగా ఈ అనౌన్సమెంట్ తో అయితే పాన్ ఇండియా వైడ్ గా ఒకో దిగ్గజ నటుడు ఈ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుపగా తమిళ్ నుంచి రజినీకాంత్ తెలుగు నుంచి రాజమౌళి కన్నడ నుంచి సుదీప్ హిందీ నుంచి అమీర్ ఖాన్ అలాగే మలయాళం నుంచి మోహన్ లాల్ అయితే ఈ సినిమా గ్లింప్స్ ని విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయగా.

ఇంట్రెస్టింగ్ గా ఈ పోస్టర్స్ అన్నిటిలో కూడా అందరి ఫోటోలు తమ ఓల్డ్ ఫోటో గ్రాఫ్ లనే పెట్టడం ఆసక్తికరంగా శంకర్ మార్క్ లో ఉందని చెప్పాలి. మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలి అంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే. 
https://x.com/LycaProductions/status/1720010424945668387?s=20
https://x.com/LycaProductions/status/1720017914903085489?s=20 
https://x.com/LycaProductions/status/1720025471990354104?s=20
https://x.com/LycaProductions/status/1720033050472702314?s=20
https://x.com/LycaProductions/status/1720040573531504950?s=20