పవన్ “ఓజి” లో మూడు స్టేజెస్ అట.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ ఏక్షన్ చిత్రం ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కోసం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ వర్కింగ్ టైటిల్ తో కొనసాగుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతుంది.

అంతే కాకుండా ఈ సినిమా అయితే రీసెంట్ గానే ముంబై లో భారీ యాక్షన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నట్టుగా మేకర్స్ కూడ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమాలో పవన్ ఎలా కనిపిస్తాడు అనే దానిపై ఇప్పటికే చాలా రూమర్స్ ఉన్నాయి. ఒక నింజా గా పవన్ కనిపిస్తాడని అలాగే ఓ డాన్ లా కూడా ఉంటాడని చాలానే వార్తలు వచ్చాయి.

అయితే ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ రూమర్ పవన్ పై బయటకి వచ్చింది. ఈ సినిమాలో పవన్ మొత్తం మూడు షేడ్స్ లో కనిపిస్తాడట. అంటే మొదట ఓ యువకుడుగా తర్వాత మధ్య వయస్కుడిగా ఆ తర్వాత ఇంకొంచెం ఏజ్ వచ్చే డాన్ పాత్రలో తాను కనిపించనున్నాడట.

దీనితో ఇలా తన పాత్ర మూడు స్టేజెస్ లో ఉంటే మూడు భిన్నమైన లుక్స్ లో తాను కనిపిస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే అంచనాలు మరింత స్థాయిలో వెళ్తున్నాయి. మరి ఓవరాల్ గా సుజీత్ అండ్ టీం ఏం చేస్తారో చూడాలి. కాగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.