సల్మాన్ ఖాన్.. చంపేస్తామని మరో వార్నింగ్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఎంత పాపులారిటీ ఉందో అంతగా ద్వేషించే వారు కూడా ఉన్నారు. తరుచుగా అతన్ని వివాదాలు చుట్టుముడుతూ ఉంటాయి. గతంలో కృష్ణజింకలని వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ జైలు జీవితాన్ని అనుభవించడం జరిగింది. తరువాత ఓ జర్నలిస్టుని దాడి చేసిన ఘటనలో కూడా సల్మాన్ ఖాన్ మీద కూడా కేసు నమోదైంది. ఇలా చాలా వివాదాలు అతన్ని వెంటాడుతున్నాయి.

అయితే గత కొంతకాలంగా గ్యాంగ్ స్టార్స్ ని సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు వస్తూ ఉండటం సంచలనంగా మారింది. గతంలో ఓ సారి గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకి పాల్పడింది. ఇది అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దాంతో అప్పట్లో సల్మాన్ ఖాన్ కి ప్రత్యేకంగా పోలీస్ సెక్యూరిటీ కల్పించారు. అయితే తాజాగా మరోసారి లారెన్స్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ ని బెదిరింపు మెయిల్స్ రావడం సంచలనంగా మారింది.

దీనిపై సల్మాన్ ఖాన్ టీమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడికి రోహిత్ గార్గ్ పేరు తో ఈ బెదింపు ఈమెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది. లారెన్స్ బీష్ణోయ్ ఈ మద్య ఇంటర్వ్యూ ఇచ్చారని, ఇది సల్మాన్ ఖాన్ చూసి ఉంటాడని అనుకుంటున్నట్లు మెయిల్ లో పేర్కొన్నారు. ఇక ఈ మెయిల్స్ ని పరిశీలిస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.

కొద్ది రోజుల క్రితం ఓ చానల్ లో లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ ఇచ్చి అందులో సల్మాన్ ఖాన్ మీద నేరుగానే బెదిరింపులకి పాల్పడ్డారు. ఇక ఈ గ్యాంగ్ స్టార్ బెదిరింపుల నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ ఖాన్ కి వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించినట్లు తెలుస్తుంది. లారెన్స్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ ఇలా బెదిరింపులు ఎదుర్కోవడం దీంతో రెండో సారి కావడం విశేషం. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ కాటమరాయుడుని హిందీ రీమేక్ లో నటించారు.ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.