అరెరే.. పుష్ప 2 సినిమాలో ఆ సీన్లు లేవే.. ఏమయ్యాయబ్బా!

ప్రస్తుతం పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఈ మధ్యకాలంలో ఇంత మంచి హైప్ తెచ్చుకున్న సినిమా మరొకటి లేదు. 12 వేలకు పైగా స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కావటం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లు దాటడం ఇలా రిలీజ్ కి ముందే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా దాదాపు 1000 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ప్రస్తుతం ఉన్న క్రౌడ్ చూస్తుంటే ఆ మార్కుని ఈజీగా దాటేస్తుంది అనిపిస్తుంది. సినిమాకి జాతర సీన్ హైలెట్ అంటున్నారు సినిమా చూసినవాళ్లు.

ఒకవైపు ఈ సినిమా హిట్ ని ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు లేనిపోని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా ప్రియులు. అదేమిటంటే గతంలో పుష్ప ని పోలీసులు పట్టుకున్నట్టు, జైల్లో పెట్టినట్టు పుష్ప జైలు నుంచి తప్పించుకున్నట్టు, పుష్పని పట్టుకుని ప్రయత్నంలో అతని పై కాల్పులు జరిపినట్లు అంతేకాకుండా సంపాదించిన సంపదని ప్రజా శ్రేయస్సుకి వాడుతున్నట్లు, వారందరూ పుష్ప కి సపోర్ట్ చేస్తున్నట్లు ఒక టీజర్ విడుదల అయింది.

అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్న అనుమానం ఏమిటంటే ఆ టీజర్ లో ఉన్న ఒక్క సీన్ కూడా ఈ సినిమాలో లేదు, ఎందుకు ఈ సినిమాలో ఆ సీన్స్ పెట్టడం లేదు? టీజర్ విడుదలైనప్పుడు కొన్ని విమర్శలు ఎదురవటం అందరికీ తెలిసిందే, విమర్శలకు భయపడిన మూవీ టీం ఆ సీన్స్ ని తీసేసారా లేదంటే పార్ట్ 3 లో ఆ సీన్స్ ని వాడుకుంటారా అనే అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయంపై మూవీ టీం ఇంకా ఎలాంటి స్పందన తెలియజేయలేదు, ముందు ముందు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం పుష్ప 2 అయితే ఊహించని కలెక్షన్లతో, ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదరణతో హౌస్ ఫుల్ థియేటర్స్ తో డబుల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక మరెన్ని రికార్డులు కొల్లగొట్టబోతుందో చూడాల్సిందే.