మెగాస్టార్ చిరంజీవి.! ఆ నలుగురు.!

మెగాస్టార్ చిరంజీవి జోరు బాగా పెంచేశారు. ‘వాల్తేర్ వీరయ్య’ ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు సైన్ చేసేస్తున్నారట చిరంజీవి. తన లిస్టులో ఇప్పటికే కొందరు డైరెక్టర్లు క్యూలో వున్నారు. వారిలో ముఖ్యంగా వినాయక్, పూరీ జగన్నాధ్, త్రినాధరావు నక్కిన, బాబీతో ఇంకో సినిమా. ఈ నలుగురూ కాకుండా, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా చిరంజీవి లిస్టులో వున్నాడు.

ఆల్రెడీ సురేందర్ రెడ్డితో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేశారు మెగాస్టార్. అప్పుడే మళ్లీ కలిసి పని చేద్దాం అని మాటిచ్చారు. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ సినిమాతో బిజీగా వున్నారు. ఆ సినిమా పూర్తి కాగానే మెగాస్టార్ చిరంజీవితో సినిమా షురూ చేయనున్నారనీ తెలుస్తోంది.

మొత్తానికి బాబీని కొన్ని రోజులు పక్కన పెడితే, మిగిలిన ఆ నలుగురూ ఎనీ టైమ్ మెగాస్టార్‌తో సినిమా పట్టాలెక్కించేందుకు ‘వెయిట్టింగ్..’ అంటున్నారట.