ఎవరినీ ఉద్దేశించి ఆ డైలాగులు రాయలేదు – చిరు

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు కలిగేలా చిరంజీవి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొని విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ సినిమాలో ఉన్నటువంటి పొలిటికల్ డైలాగ్ ల గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.

రాజకీయాలు తన నుంచి దూరం కాలేదని తానే రాజకీయాలకు దూరంగా ఉన్నానని మెగాస్టార్ చెప్పిన ఈ డైలాగ్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి డైలాగులు చెప్పారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా విలేకరులు ఈ డైలాగులపై ప్రశ్నలు అడగగా చిరంజీవి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

కథ డిమాండ్ పట్టి డైలాగులు రాసాం. అలాగే ఒరిజినల్ కథ ఎలాగుందో అందులో డైలాగ్స్ ఎలా ఉన్నాయో తెలుగులో కూడా తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా డైలాగులను రాశామని అంతకుమించి ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులను ఎవరిని ఉద్దేశించి ఈ డైలాగులు రాయలేదని తెలిపారు.ఇక ఈ డైలాగుల పట్ల కొందరు భుజాలు తడుపుకుంటే అందుకు తాను ఏమి చేయలేనని మెగాస్టార్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత రాబోతున్న గాడ్ ఫాదర్ సినిమా అభిమానులకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో తెలియాల్సి ఉంది.