చిరుకి ‘ఐ లవ్ యు’ చెప్తున్న యంగ్ యాంకర్..పిక్ వైరల్!

Sreemukhi-Set-To-Marry-a-Businessman

ఇప్పుడు టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న నెక్స్ట్ బిగ్ రిలీజ్ ఏదన్నా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం “భోళా శంకర్” అనే చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించగా ఈ చిత్రం తమిళ హిట్ చిత్రం వేదాళం కి రీమేక్ గా అయితే చేశారు.

మరి చిత్ర యూనిట్ అయితే సినిమా పట్ల కాన్ఫిడెన్స్ గానే ఉన్నారు కానీ రియాలిటీలో మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలా ఉంటుందో అర్ధం కాని పరిస్థితి. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమాలో మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న నటి అలాగే యంగ్ యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ గా చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది.

మరి ఇందులో భోళా జి ఐ లవ్ యు అంటూ పోస్ట్ చేసింది. అలాగే మెగాస్టార్ ని ఆమె హగ్ చేసుకొని అయితే హ్యాపీ మూమెంట్ లో అయితే కనిపిస్తుంది. దీనితో ఈ మెగా పిక్ మంచి వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో అయితే ఇద్దరి మధ్య క్రేజీ సీక్వెన్స్ నే మెహర్ ప్లాన్ చేసాడని తెలుస్తుంది.

అంతే కాకుండా ఇది మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఖుషి లో నడుము సీన్ అన్నట్టుగా కూడా టాక్ ఉంది. మరి అలాంటి ఐకానిక్ సీన్ ని చిరు అలాగే శ్రీముఖిలు ఎలా రిక్రియెట్ చేసారో చూడాలి. ఇంకా ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా మహతి సాగర్ సంగీతం అందించాడు. అలాగే ఈ ఆగస్ట్ 11న సినిమా రిలీజ్ కాబోతుంది.