ఈరోజు తెలుగు సినిమా ఆరాధ్య దైవం అయినటువంటి నందమూరి తారకరామారావు శత వసంతాలు సందర్భంగా అయన ఖ్యాతిని గడిస్తూ దేశ ప్రభుత్వం అయితే 100 రూపాయల నాణెం ని ఈరోజు రాష్ట్రపతి భవంతిలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వేడుకకి గాను నందమూరి కుటుంబం నుంచి మాత్రమే కాకుండా నారా వారి నుంచి కూడా ఆహ్వానం మేరకు అయితే చాలా మంది వెళ్లారు. కాగా వారితో అయితే RRR స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఈ కార్యక్రమానికి గాను ఆహ్వానం వెళ్లగా ఎన్టీఆర్ అయ్యితే హాజరు అవుతాడు అని చాలా మంది అనుకున్నారు.
కానీ అనుకోని విధంగా ఎన్టీఆర్ మాత్రం తన తాత కోసం వెళ్ళలేదు. కాగా దీనికి “దేవర” షూటింగ్ ఉండడం వల్లే వెళ్ళలేదు అని ఓ వర్గం చెప్తున్నప్పటికీ ఎన్టీఆర్ కి పర్శనల్ గా వెళ్లడం ఆసక్తి లేకే వెళ్ళలేదు అని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా అక్కడ నందమూరి కుటుంబంతో అయితే నారా నుంచి చంద్రబాబు కూడా ఈ కార్యక్రమానికి రావడమే అన్నట్టుగా తెలుస్తుంది.
తనని ఫేస్ చేయడం ఇష్టం లేకే వెళ్ళలేదు అని అంటున్నారు. కాగా ఈ మధ్య కాలంలో పొలిటికల్ పరంగా కూడా ఎన్టీఆర్ చంద్రబాబు వర్గాలకి కూడా పడట్లేదు అని తెలిసిందే. ఇది కూడా ఒక కారణం అని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మరి ఈ కారణం తోనే ఎన్టీఆర్ వెళ్ళలేదు అని భోగట్టా..