“ఓజి” సెట్స్ లో పవర్ స్టార్ వచ్చేది అప్పుడే.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు అనేక సినిమాలు వరుసగా చేస్తున్న సంగతి తెలిసిందే. తన సినిమాలు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి పవన్ రేంజ్ లో స్పీడ్ తో కంప్లీట్ చేస్తుండగా పవన్ ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్న సినిమాలు మాత్రం రెండే ఉన్నాయి.

ఆ సినిమాలే దర్శకుడు క్రిష్ తో ప్లాన్ చేసిన మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు కాగా మరో సినిమా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా “ఓజి” కూడా ఒకటి. ఐతే ఓజి విషయంలో లేటెస్ట్ గా పలు క్రేజీ అప్డేట్స్ వైరల్ గా మారాయి.

మరి ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పుడు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారట. మొదట టెస్ట్ షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెట్స్ లో పవర్ స్టార్ ఈ ఏప్రిల్ 17 నుంచే జాయిన్ కానున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి కొన్ని వారాల పాటుగా ఈ సినిమా ఏక్షన్ షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ లాక్ కాగా ఈమె కూడా షూట్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. మొత్తానికి ఇలా అయితే పవన్ ఓ రేంజ్ లో బిజీగా ఉన్నారు. కాగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.