లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర అనౌన్స్ అయ్యిన మాస్ ప్రాజెక్ట్ లలో మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ అలాగే దర్శకుడు కొల్లి బాబీ ల కాంబినేషన్ లో సినిమా కూడా ఒకటి అని చెప్పాలి. కాగా ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో 109 వ సినిమా కాగా నిన్న బాలయ్య బర్త్ డే కానుకగా అయితే ఇది మాసివ్ అనౌన్సమెంట్ తో వచ్చింది.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కూడా అదియే ఏక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతూ ఉండగా మేకర్స్ అతి త్వరలోనే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నారు. మరి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2024 రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా తెలిపిన సంగతి తెలిసిందే. మరో 2024 లో ఈ సినిమా ఎప్పటికి రావచ్చు అనేది ఇపుడు తెలుస్తుంది.
కాగా ఇప్పుడు ఉన్న ప్లాన్ ప్రకారం అయితే వచ్చే ఏడాది మొదటి హాఫ్ లోనే ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చేస్తుండగా అంటే 2024 లో మూడు నెలల్లోపే బాలయ్య ప్రపంచ బిగ్ స్క్రీన్స్ ని హిట్ చేస్తుంది అని తెలుస్తుంది.
మెయిన్ గా బాబీ మెగాస్టార్ చిరంజీవి కి వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చాక అనౌన్స్ అయ్యిన సినిమా ఇది కాబట్టి మంచి అంచనాలు అయితే నెలకొన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు తమ బ్యానర్ లో 25వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.