Big Boss Non Stop Telugu: తక్కువ ఓటింగ్ తో వెనుకబడ్డ అజయ్..ఈ వారం ఎలిమినేట్ కానున్నడా..?

Big Boss Non Stop Telugu: బుల్లితెర మీద ప్రసారమయ్యే టీవీ షోలలో మంచి ఆదరణ పొందిన వాటిలో బిగ్ బాస్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ రియాలిటీ షో ఓటిటి లో ప్రతిరోజు 24 గంటల పాటు నాన్ స్టాప్ గా ప్రసారమవుతోంది.ఇప్పటి వరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ప్రస్తుతం ప్రసారమవుతున్న సీజన్ కూడా ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది.17 మంది కంటెస్టెంట్ లతో మొదలైన ఈ రియాలిటీ షో లో ఇప్పటివరకు ఏడు మంది కంటెస్టెంట్ లుఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఎనిమిది వారంలో నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా ఇందులో ఆరు మంది నామినేట్ అయ్యారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన బాబా భాస్కర్ మాస్టర్ బిగ్ బాస్ ఇచ్చిన పవర్ తో బిందు మాధవిని సేవ్ చేయగా మిగిలిన ఐదు మంది కంటెస్టెంట్ లలో అఖిల్, అనిల్ అధిక ఓట్లతో ముందు వరుసలో ఉండగా, ఆషూ రెడ్డి మూడో స్థానంలో ఉంది. ఇక హామీద నాలుగో స్థానంలో ఉండగా అతి తక్కువ ఓట్లతో అజయ్ చివరి స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో ఈ వారం అజయ్ ఎలిమినేట్ అవ్వనున్నాడు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అఖిల్ కి ఎంతో హెల్ప్ చేసిన అజయ్ ఇలా నామినేషన్ లో ఉంటే బిగ్ బాస్ సేవ్ ట్యాగ్ ఎవరికైన ఇవ్వమని చెప్పినప్పుడు అఖిల్ మిత్ర శర్మకు సేవ్ ట్యాగ్ ఇవ్వటంతో అజయ్ షాక్ అయ్యాడు. అఖిల్ తన కోసం అజయ్ ని వాడుకొని చివరికి సహాయం చేయకుండా ఇలా మోసం చేయటంతో అజయ్ ఫోల్లోయర్స్ సీరియస్ అవుతున్నారు. ఈ సమయంలో 8 వ వారం అజయ్ ఎలిమినేట్ అవుతాడు అనే విషయం గురించి క్లారిటీ రావాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి.