నిఖిల్ “స్పై” ముందు టార్గెట్ ఎంతంటే.!

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మార్కెట్ లో తమ మొదటి అటెంప్ట్ లోనే సక్సెస్ అయ్యిన హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. మరి అలాంటి హీరోస్ లో అయితే లేటెస్ట్ గా యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా చేరాడు. మరి తన భారీ హిట్ “కార్తికేయ 2” తో హిందీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాను ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా రిలీజ్ కి వెళ్తున్నాడు.

ఆ సినిమానే “స్పై”. దర్శకుడు గ్యారీ బి హెచ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ ఎమోషన్ సుభాష్ చంద్రబోస్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు ఆధారంగా తెరకెక్కించగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ జూన్ 29న గ్రాండ్ గా 1600 స్క్రీన్స్ కి పైగా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా రాబోతుంది అని నిఖిల్ కన్ఫర్మ్ చేసాడు.

అయితే ఈ చిత్రం ఇంకా గట్టి బజ్ ని తెచ్చుకోలేదు కానీ బాక్సాఫీస్ దగ్గర కూడా నిఖిల్ కెరీర్ లోనే ఎక్కువ బిజినెస్ ని జరుపుకున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఈ చిత్రానికి 17 నుంచి 18 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది అని తెలుస్తుంది. దీనితో 20 కోట్లకి పైగా షేర్ ని రాబడితే తప్ప ఈ చిత్రం హిట్ స్టేటస్ లోకి వెళ్ళదు అని చెప్పాలి.

మరి రేపు రానున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇంకా ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. ఇక ఆర్యన్ రాజేష్ రాజేష్ తదితరులు నటించగా రానా అయితే క్యామియో పాత్రలో నటించాడు.