“ఖుషి” షూట్ లో ఆ టాపిక్ నే రానివ్వలేదట..!

ప్రస్తుతం టాలీవుడ్ లో డీసెంట్ క్రేజ్ తో రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ అలాగే సమంతల కాంబినేషన్ లో వస్తున్నా లేటెస్ట్చ్ చిత్రం “ఖుషి” సిద్ధంగా ఉంది. ఫలితం ఎలా ఉంటుందో కానీ మేకర్స్ అయితే పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

కాగా ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు శివ నిర్వాణం ఓ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ప్లాన్ చేయగా ఈ సినిమా ప్రమోషన్స్ అయితే ఇపుడు స్టార్ట్ అయ్యాయి. కాగా ఈ ప్రమోషన్స్ లో సినిమా దర్శకుడు చెప్పిన మాటలు కొన్ని వైరల్ గా మారాయి.

తనని సినిమా షూటింగ్ లో అలాగే సినిమాలో కూడా ఎలాగో పెళ్లి టాపిక్ ఉంది కాబట్టి మీరు కూడా సమంత పెళ్లి విషయంలో ఏమన్నా అడిగారా అనేదానికి శివ నిర్వాణ అలాంటిది ఏది లేదు అని చెప్పాడు. ఒకవేళ ఏమన్నా వచ్చిన సామ్ ఇష్టపడేది కాదు అన్నట్టుగా సెలవిచ్చారు.

ఇంకా ఒక నటిగా మాత్రం మేము ఆమెని చూసాము అలానే ఆవిడ కూడా ప్రొఫిషినల్ పరంగా ఎక్కడివరకు అయినా వెళ్తారు అని చెప్పాడు. అయితే రీసెంట్ గా సుమ ఇంటర్వ్యూ లో అయితే సమంత దగ్గర పెళ్లి సంబంధించి టాపిక్ వచ్చినపుడు ఆమె సీరియస్ గా మారడం వంటివి మాత్రం వైరల్ అయ్యాయి. మరి ఈ సెప్టెంబర్ 1న వచ్చే సినిమా ఐతే ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు.