షారుఖ్ సినిమాలో ఈ టాలీవుడ్ స్టార్ సెన్సేషనల్ క్యామియో.?

Jawan Movie

లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర మైండ్ బ్లాకింగ్ కం బ్యాక్ ని అందుకున్న హీరో షారుఖ్ ఖాన్. తన పఠాన్ సినిమాతో బాలీవుడ్ లో కనీ వినీ ఎరుగని రీతి హిట్ ని తాను కొట్టాడు. ఇక నెక్స్ట్ కూడా తన నుంచి సెన్సేషనల్ లైనప్ ప్యాక్ అయ్యి ఉండగా ఈ చిత్రాల్లో కోలీవుడ్ యంగ్ దర్శకుడు అట్లీ తో చేస్తున్న చిత్రం “జవాన్” కూడా ఒకటి.

ఈ సినిమాపై అయితే పఠాన్ పై మించిన హైప్ ఉండగా ఈ సినిమా షూటింగ్ లో కూడా షారుఖ్ ఖాన్ గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు. కాగా ఈ సినిమాపై ఇప్పుడు సినీ వర్గాల్లో క్రేజీ రూమర్ ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ సినిమాలో మన టాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరో అదిరే క్యామియో రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు.

మరి ఇంతకీ ఆ హీరో ఎవరో కూడా కాదట పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో రియల్ స్టార్డం చూపించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని భోగట్టా. మరి అట్లీ అల్లు అర్జున్ ని సంప్రదించగా అల్లు అర్జున్ ఇంకా ఓకే చెప్పాల్సి ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఇదే కానీ అయ్యితే నార్త్ మార్కెట్ మాత్రం వసూళ్లతో మోత మోగిపోతుంది అని చెప్పొచ్చు.

కానీ ఇందులో ఇంకా ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా తమిళ హీరో విజయ్ కూడా ఓ గెస్ట్ రోల్ లో నటిస్తాడని రూమర్ ఉన్నాయి.