Megastar film : మెగాస్టార్ భారీ సినిమాలో తెలుగు గ్లామరస్ యంగ్ యాంకర్.!

Megastar film : టాలీవుడ్ దిగ్గజ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన బిగ్ బడ్జెట్ చిత్రం “ఆచార్య” రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత మరికొన్ని ఆసక్తికర సినిమాలు చేస్తున్న మెగాస్టార్ ఎప్పటికప్పుడు అదిరే అప్డేట్స్ ని తన సినిమాలు నుంచి ఇస్తుండగా..
ఇప్పుడు వీటిలో ఓ భారీ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి కన్ఫర్మ్ అయ్యింది. తమిళ్ సినిమా వేదాళం కి రీమేక్ గా దర్శకుడు మెహర్ రమేష్ తో చేస్తున్న సాలీడ్ యాక్షన్ డ్రామా చిత్రం “భోళా శంకర్”. మరి ఈ సినిమాలో ఇప్పుడు చిరు తో స్క్రీన్ పంచుకునే ఛాన్స్ ని తెలుగులో మంచి గ్లామర్ కలిగిన యంగ్ యాంకర్ శ్రీముఖి కొట్టేసింది.
నిన్న ఫిబ్రవరి 25 మెగాస్టార్ సినిమా భోళా శంకర్ సినిమాలో నటించడమే కాకుండా అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ని కూడా తమ దర్శకుడు మెహర్ రమేష్ తో కలిసి చూడడం జరిగింది అని తెలిపింది. దీనితో మెగాస్టార్ సినిమాలో తాను కూడా ఉన్నట్టుగా ఒక కీలక అప్డేట్ ని అయితే తాను ఇచ్చేసింది.
మరి ఆ సినిమాలో తాను ఎలాంటి పాత్ర చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మెగాస్టార్ కి చెల్లెలు పాత్రలో నటిస్తుంది.
https://twitter.com/MukhiSree/status/1497284531082043392?s=20&t=fsihvlTVKIAQH_0qlgz_XQ