“విశ్వంభర” లో చిరు సరసన ఈ స్టార్ హీరోయినే.. 

లేటెస్ట్ గా టాలీవుడ్ ఆడియెన్స్ అంతా కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్న భారీ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ఠతో చేస్తున్న మాసివ్ ఫాంటసీ డ్రామా “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ నిన్ననే మొదలు కాగా మెగాస్టార్ కూడా ఈ సినిమా కొత్త షెడ్యూల్ లో నిన్ననే పాల్గొన్నారు.

కాగా ఈ చిత్రం చాలా యూనిక్ కాన్సెప్ట్ తో చేస్తుండగా ఆడియెన్స్ లో చాలా ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా ఈ చిత్రంలో సాలిడ్ ఎమోషన్స్ కూడా ఉంటాయని దర్శకుడు కన్ఫర్మ్ చేసాడు. అయితే ఈ సినిమాలో చిరు సరసన చాలా మంది హీరోయిన్స్ ఉంటారని కొన్ని రూమర్స్ ఉన్నాయ్.

కాగా ఇప్పుడు ఈ హీరోయిన్స్ లో మాత్రం ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష మాత్రమే మెగాస్టార్ సరసన నటిస్తుంది అని సినీ వర్గాలు ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాయి. కాగా అప్పుడు స్టాలింగ్ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు త్రిష చిరుతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

మరి ఇప్పుడు ఈ సరికొత్త షెడ్యూల్ లో కూడా ఆమె జాయిన్ అవుతుంది అని సినీ వర్గాల్లో టాక్. ఇక ఈ అంశంపై ఐతే త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చట. ఇంకా ఈ భారీ చిత్రానికి యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.