క్రేజీ – మెగాస్టార్ కోసం సాంగ్ రైటర్ గా మారిన సీనియర్ డైరెక్టర్!

తెలుగు సినిమా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి తాను ఇప్పటివరకు సెట్ చేయని రికార్డు లేదు చూడని హిట్ గాని హైప్ కానీ లేదు ఎప్పుడో ఇండియా లోనే అమితాబ్ బచ్చన్ కన్నా హైయెస్ట్ స్టార్డం ను చూసిన మెగాస్టార్ కి ఉన్న కల్ట్ ఫ్యాన్స్ అంతా ఇంత మంది కాదు.

అలాంటి ఎందరో కోట్లాదిమంది అభిమానులు అన్నయ్యగా పిలుచుకునే వారిలో రీసెంట్ గా బేబీ నిర్మాతలు, దర్శకుడు సహా తమ ఫ్యానిజం ని బయట పెట్టారు. అయితే లేటెస్ట్ గా ఓ సీనియర్ దర్శకుడు వారిలానే మెగాస్టార్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అయినటువంటి అతను మెగాస్టార్ కోసం మొదటిగా సాంగ్ రైటర్ గా మారాడు.

మరి అతడు ఇంకెవరో కూడా కాదు ప్రస్తుతం మెగాస్టార్ తో “భోళా శంకర్” అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న దర్శకుడు మెహర్ రమేష్. అవును మెహర్ రమేష్ మెగాస్టార్ కోసం మొదటిసారి పెన్ పట్టి లిరిక్స్ రాసాడు. లేటెస్ట్ గా మేకర్స్ ఇచ్చిన అప్డేట్ తో అయితే ఇది కన్ఫర్మ్ అయ్యింది.

మరి రేజ్ ఆఫ్ భోళా అనే సరికొత్త సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేయగా ఈ సాంగ్ లిరిక్స్ ఇచ్చింది ఎవరు అని చూస్తే అందులో మెహర్ పేరు కూడా ఉంది. దీనితో మెగాస్టార్ కోసం సాంగ్ రైటర్ గా కూడా మెహర్ మారడం ఓ ఎత్తు అయితే అందులోని ఓ ర్యాప్ సాంగ్ కి రాయడం అనేది మరో క్రేజీ అంశం అని చెప్పాలి. ఇక ఈ సాంగ్ ని అయితే మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మరి మెహర్ ఎలాంటి లిరిక్స్ మెగాస్టార్ కోసం అందించాడో చూడాల్సిందే.