రష్మీ – సుధీర్ లకు బుల్లితెర జంటగా ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రష్మీ – సుధీర్ లకి కలిసి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. రష్మీ – సుధీర్ కలిసి చేసిన ఎన్ని షోలు, ఈవెంట్లు చేసి జనాలని ఆకట్టుకున్నారో లెక్కే లేదు. ఇక రష్మీ – సుధీర్ కలిసి చేసిన ప్రతీ షో సూపర్ సక్సెస్ కావడంతో ఇద్దరికీ మంచిపేరును తెచ్చిపెట్టాయి. ఒకవైపు బుల్లితెరపై షోలు.. మరోవైపు ఈవెంట్లతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో అవకాశాల కోసం రష్మీ, సుధీర్ లు ప్రయత్నిస్తూ వెండితెరపై కూడా సక్సెస్ కావడానికి గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇప్పటికే రష్మిక కొన్ని సినిమాలు చేసి హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. ఇక సుధీర్ కూడా సాఫ్ట్‌వేర్ సుధీర్ అన్న సినిమా చేసి హీరోగా మారాడు.
కాగా రీసెంట్ గా ఒక షో కి రష్మీ హాజరు కాగా ఆ షోలో రష్మీకి పెళ్లికి, సుధీర్ కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఇప్పటికే రష్మీ – సుధీర్ లని చాలామంది ఎన్నో ప్రశ్నలు వేసి వాళ్ళు చెప్పిన సమాధానాలకి డిసప్పాయింట్ అయిన సంగతి తెలిసిందే. అయినా మళ్ళీ మళ్ళీ రష్మీ – సుధీర్ లకి ఉన్న క్రేజ్ తో ఆతృతగా రకరకాల ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సుధీర్ ను పెళ్లి చేసుకుంటారా.? అని రష్మీకి ప్రశ్న ఎదురు కాగా రష్మీ ప్రస్తుతం కెరీర్ గురించి తన ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయని ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చింది.
అయితే చాలామందికి నేను సుధీర్ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ పెళ్లి గురించి నా ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయని రష్మీ చెప్పుకొచ్చింది. ఇంకా కెరీర్ పరంగా బాగా స్థిరపడాలని రష్మీ ఆ తర్వాతే పెళ్ళి గురించి ఆలోచిస్తానంటూ రష్మీ చెప్పుకొచ్చింది. పెళ్లి కంటే లైఫ్ లో ఎన్నో ముఖ్యమైన పనులు ఉన్నాయని ..భవిష్యత్తుకు సరైన విధంగా ప్రణాళికలు వేసుకుని ఆ తరువాత పెళ్లి గురించి ఆలోచిస్తానని రష్మి చాలా క్లారిటీగా తెలిపింది. మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా సుధీర్ తో కలిసి నటించడానికి రెడీ అని చెప్పింది. కాగా రష్మి, నందు ప్రధాన పాత్రల్లో నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా త్వరలో విడుదల కానుంది.