Mahesh Babu – Rajamouli:మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే కథ ఇదే!

Mahesh Babu – Rajamouli: డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ మహేష్ బాబుతో అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ అని గతంలో తెలిసింది. ఇక ఈ సినిమాకు రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నాడు.

తాజాగా విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథపై హింట్ ఇచ్చాడు. మొదటినుంచి రాజమౌళికి ఫారెస్ట్ అంటే ఇష్టమని.. ఆ నేపథ్యంలో వచ్చే కథలంటే ఇష్టమని తెలిపాడు. ఆయన జంతువులను బాగా ఇష్టపడతానని.. అందుకే ఆ నేపథ్యంలో సినిమా తీయాలని అనుకోవటంతో.. ఆఫ్రికా అడవి నేపథ్యంలో ఈ కథను రెడీ చేశానని తెలిపాడు. ఇక ఈ కథ రాజమౌళి వినలేదని.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా కథ వింటాడని తెలిపాడు.