టాలీవుడ్ సినిమా దగ్గర ఒక సరైన పాన్ ఇండియా సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. అయితే మన తెలుగు సినిమాలకి మెయిన్ మార్కెట్ హిందీలో కూడా ఉంది. చాలా మంది హీరోస్ కి అదిరే రెస్పాన్స్ ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. దీనితో ఒకొక్కరూ జంకుతూనే హిందీలో తమ సినిమాలు రిలీజ్ చేస్తుండగా..
అలా హిందీ మార్కెట్ లో ఎంటర్ అయ్యేందుకు చాలానే ట్రై చేసి వెళ్లిన మరో యంగ్ హీరో రామ్ పోతినేని కూడా ఒకడు. మరి రామ్ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో చేసిన భారీ చిత్రమే “స్కంద”. మరి ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి అదిరే వసూళ్లు అందుకుంది.
కానీ హిందీ వెర్షన్ కి అంత చప్పుడు లేదు. మరి అసలు ఈ సినిమాకి హిందీ రెస్పాన్స్ ఎలా ఉందో అక్కడ కొన్ని హిందీ ప్రముఖ ఛానెల్స్ నుంచి అయితే సమాచారం వస్తుంది. హిందీలో ఈ సినిమా చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. దీనితో అంత రీచ్ ఈ చిత్రానికి దక్కలేదు. కానీ సింగిల్ స్క్రీన్స్ లో చూసిన కొందరు మాత్రం ఈ చిత్రానికి బాగా రెస్పాన్స్ ఇస్తున్నారట.
మెయిన్ గా మాస్ థియేటర్స్ గాని ఈ సినిమా పెంచుకుంటే మాత్రం సినిమాకి వర్కౌట్ అవుతుంది అని అంటున్నారు. దీనితో అక్కడ డిస్ట్రిబ్యూషన్ సంస్థ జీ స్టూడియోస్ వారు ఈ రెస్పాన్స్ ని ఏమన్నా అనుసరించి పెంచుకుంటారో లేదో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఉన్న లిమిటెడ్ సింగిల్ స్క్రీన్స్ వరకు బానే ఉందట మరి. చూడాలి స్కంద కి ముందు రోజుల్లో ఏమవుతుందో..