Actress Hema: రాజేశ్వరి అనే సీనియర్ ఆర్టిస్ట్ మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఎంత చెప్పినా కూడా ఎలక్షన్ జరుగుతున్న సమయంలో అక్కడే అందరికీ కార్డులు పంచారని నటి హేమ అన్నారు. ఆవిడను ఇప్పుడు అడిగినా కూడా తాను నిజమే చెప్తుందని ఆమె చెప్పారు. ఆవిడకు 100 సార్లు చెప్పినా ఆమె వినిపించుకోలేదని ఆమె చెప్పారు.
ఇకపోతే అక్కడే ఉన్న మోహన్ బాబు గారి దగ్గరికెళ్లిన ప్రియమణిని నీ దగ్గర కార్డు ఉందా అని ఆయన అడిగేసరికి, శివ బాలాజీ భార్య ఆ కార్డ్స్ తీసుకొచ్చి వీళ్లు మనవాళ్లు అని ఆమె వివరించిందని హేమ తెలిపారు. అది చూసి తాను అరిచానని, అక్కడే ఓటు వేయడానికి వెళ్తున్నారు, అక్కడే ఆమె అలా కార్డులు పంచుతుందని ఆమె చెప్పారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా శివ బాలాజీ కూడా ఏమీ మాట్లాడలేదని, కానీ ఒక వ్యక్తి కేవలం కార్డు ఇస్తున్నాడని చెప్పి, నరేష్ గారు, అతనితో పాటు కొందరు కలిసి అతన్ని కొట్టడానికి వెంబటించారని ఆమె చెప్పారు.
అది ఆపడానికి తాను ప్రయత్నించే సమయంలోనే శివ బాలాజీ తన చేయి పట్టుకున్నాడని హేమ చెప్పారు. తనను వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, అప్పటికీ తాను ఆ అబ్బాయినికి కాపాడేందుకు వెళుతున్నానని, అరుస్తున్నానని ఆమె అన్నారు. ఆ సమయంలో తనకు అక్కడినుంచి ఎలా వెళ్లాలో తెలియక అతని చేయిని కొరకడానికి ప్రయత్నించానని ఆమె చెప్పారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉంటాయని ఆమె అన్నారు. తాను కేవలం ప్రయత్నించానని, కానీ కరవలేదని ఆమె స్పష్టం చేశారు. ఆలోపలే అక్కడికి విష్ణు వచ్చాడని ఆమె చెప్పారు.
ఈ లోపే మీడియా అంతా తాను శివబాలాజీని కరిచేశానని ప్రచారం చేసిందని ఆమె చెప్పారు. అసలు ఎందుకలా చేశాను, ఏం జరిగిందని ఏమీ తెలియకుండా అలా చెప్పారని ఆమె అన్నారు. కానీ తాను మాత్రం అక్కడ ఆ అబ్బాయిని కాపాడేందుకు అలా చేశానని, అతన్ని ఒక్కడ్ని చేసి కొట్టడానికి అంతా వెళ్లారని ఆమె చెప్పారు. అయినా కూడా అది వినిపించుకోకుండా శివ బాలాజీ ఒక విలన్‌గా ప్రవర్తించాడని, అయినా అతను అంత క్రూరుడేంటీ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకంటే చదువు లేదు, సంస్కారం లేదు.. సరే మరి నరేష్, శివబాలాజీ గారు చదువుకున్నారు కదా.. వాళ్ల సంస్కారం ఏమైందని ఆమె ప్రశ్నించారు.
అది జరిగిన తర్వాత తాను ప్రకాశ్ రాజ్ గారి దగ్గరికి వెళ్లి, సర్ జరిగిందేంటో మీడియాకు చెప్దాం సర్ అని తాను అన్నట్టు, అప్పటికే మీడియా తనను అడుగుతూ ఉన్నారని ఆమె చెప్పారు. ప్రకాశ్ గారేమో ఎలక్షన్ ఆగిపోతుందేమో.. ఎందుకు గొడవలు, మనల్ని బ్లేమ్ చేస్తారు అని, శ్రీకాంత్ గారితో సహా అందరినీ కంట్రోల్‌లో పెట్టుకుంటూ, ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి మా టీం అంతా కూడా కృషి చేశామని ఆమె స్పష్టం చేశారు.