ఇండస్ట్రీ టాక్ : “గేమ్ చేంజర్” లాస్ట్ మినిట్ ట్విస్ట్ కారణాలు అవేనా?

టాలీవుడ్ లో ఏదన్నా పండుగ వస్తుంది అంటే ఆయా హీరోస్ ఫాన్స్ కి మరో పండగ వచ్చినట్టే అని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు కొన్ని కొన్ని ఫ్రెష్ అప్డేట్స్ ని మేకర్స్ రివీల్ చేస్తూ ఉంటారు. అలానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సాంగ్ గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ ని చిత్ర బృందం ఫైనల్ గా ఈ దీపావళికి లాక్ చేశారు.

కానీ లాస్ట్ మినిట్ లో పండగకి ఒకరోజు ముందు అయితే మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. సినిమా సాంగ్ విడుదల చెయ్యట్లేదు అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దీనితో మెగా ఫ్యాన్స్ కి వచ్చిన ఆగ్రహం అంతా ఇంతా కాదు. అయితే అసలు ఈ సాంగ్ రాకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

మొదటిగా అయితే సినిమా సాంగ్ ని పాడిన సింగర్ ని మార్పించి మళ్ళీ ఇప్పుడు కొత్త సింగర్ తో పాడిస్తున్నారట. దీనితో దీనితో సాంగ్ ఖచ్చితంగా వాయిదా పడింది అని కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇంకో వెర్షన్ ఏమిటంటే సినిమా సంగీతం హక్కులు కొనుగోలు చేసిన సంస్థకి చిత్ర నిర్మాణ సంస్థకి కూడా ఉన్న కొన్ని ఆర్ధిక లావాదేవీలు విషయంలో కూడా సాంగ్ ని హోల్డ్ లో పెట్టారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం లాస్ట్ చేసి చరణ్ ఫ్యాన్స్ కి మేకర్స్ నిరాశే మిగిల్చారు.