Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాకు ఎదురైనా పెద్ద సమస్య ఇదే…. అసలు విషయం బయట పెట్టిన త్రివిక్రమ్!

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాని మలయాళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ విడుదలయ్యే థియేటర్ల దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇలా ఈ సినిమా విజయవంతం కావడంతో చిత్రబృందం విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే ఈ సక్సెస్ మీట్ లో భాగంగా పవన్ కళ్యాణ్,రానా, సంయుక్త మీనన్, తమన్, సాగర్ కే చంద్ర, త్రివిక్రమ్, రామజోగయ్య శాస్త్రి వంటి వారు పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే సమయంలో తనకు ఓ పెద్ద సమస్య ఎదురైందని తెలిపారు. అయ్యప్పనుమ్ కోషియం చిత్రం కోషి కోణంలో ఉంటుంది. అదే పాత్రని డానీగా రానా పోషించారు. దీనిని భీమ్లా కోణంలోకి
మార్చాలి ఇలా మార్చడమే మాకు పెద్ద సమస్యగా మారిపోయింది అని త్రివిక్రమ్ తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాని రీమేక్ చేస్తున్నామని ఆలోచన చేయకుండా ఆ ఆలోచన నుంచి పూర్తిగా బయటకు వచ్చి సరి కొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇలా భీమ్లా నాయక్ సినిమా కోసం చిత్ర బృందం ఎలా కష్టపడ్డారో ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా వెల్లడించారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో స్టేజ్ పైకి వెళ్లి మాట్లాడటానికి నిరాకరించిన త్రివిక్రమ్ ఈ సినిమా గురించి మాట్లాడటం తో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.