ఎన్నో సంవత్సరాల నుంచి మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. డిసెంబర్ 10న గ్రాండ్గా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతుంది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో..దిల్‌రాజు నిర్మాణంలో..రామ్‌చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై..ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయ్యాలనుకుంటున్నారో..అవే ఈ సినిమాలో హైలెట్ సీన్స్‌గా ఉండబోతున్నాయట. ట్రైలర్‌లో కనిపించిన చాలా సీన్స్ గతంలో పవన్ చేసిన పొలిటికల్ కామెంట్స్‌కు సింక్ అయ్యేలా ఉన్నాయంటున్నారు.
గేమ్‌ఛేంజర్ సినిమా పొలిటికల్ బ్రాక్ డ్రాప్ మూవీ అవ్వటం..పవన్ డైలాగ్స్ ఉన్నాయని ప్రచారం జరుగుతుండటంతో మూవీపై, ప్రీరిలీజ్ ఈవెంట్‌పై ఇంకా ఆసక్తి రేపుతోంది. అయితే ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ స్టోరీలో రామ్ చరణ్ నటించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కాగా ఇప్పుడు గేమ్ ఛేంజర్ మేనియా అంతా కొనసాగుతూ ఉండగా అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ నెల నాలుగో తేదీ రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పటివరకు ఎలాంటి సినిమా వేడుకలలో పాల్గొనలేదు. మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో రామ్ చరణ్ సినిమా ఈవెంట్ కు అతిథిగా హాజరు కాబోతున్నారు.
రామ్ చరణ్ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్న నేపథ్యంలో వివరాలను నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటిస్తూ.పవన్ లుక్‌తో కూడిన పోస్టర్ రిలీజ్ చేసింది. బాబాయ్- అబ్బాయ్ ఒకే వేదికపైకి రాబోతున్నారు.మా నాయకుడు వస్తున్నాడు అంటూ స్పెషల్ పోస్టర్స్ విడుదల చేశారు. గతంలో రంగస్థలం, నాయక్ విజయోత్సవానలకి పవన్ కళ్యాణ్ అతిధిగా వచ్చారు.మళ్లీ బాబాయ్ అబ్బాయి కలిస్తే అభిమానులకు పెద్ద పండుగ ముందే వచ్చేసినట్లే!