ఆమెతో మళ్ళీనా.? వద్దు బాబోయ్.!

అప్పుడెప్పుడో యంగ్ టైగర్ ఎన్టీయార్ సినిమాతో తెలుగు తెరపైకి తెరంగేట్రం చేయాల్సి వుందామె.! కానీ, అనివార్య కారణాల వల్ల చాలా కాలం తర్వాత తెలుగులోకి వచ్చింది. బోల్డంత హైప్ క్రియేట్ అయ్యింది ఆ సినిమా మీద. ప్రామిసింగ్ హీరో నటించాడు ఆ సినిమాలో.

చిత్రమేంటంటే, ఆమె పెద్ద స్టార్ కూడా కాదు. ఓ మోస్తరు హిట్టు సినిమాతో పాపులర్ అయ్యింది.. అదీ, తెలుగులో కాదు. ఆ సినిమా తర్వాత పెళ్ళి చేసేసుకుంది, కొన్నాళ్ళు నటనకు దూరమయ్యింది. ఆమె భర్త కూడా నటుడే. విలక్షణ నటుడు కూడా. తెలుగులోనూ నటించాడు లెండి.

ఇక, ఆ హీరోయిన్ నటించిన తొలి తెలుగు సినిమా డిజాస్టర్. ఆ హీరోనే, ఆ హీరోయిన్‌ని ఏరికోరి తెచ్చుకుని, బొక్క బోర్లా పడ్డాడు. కానీ, ఆ ఫ్లాపులో ఆమె తప్పిదం ఏమీ లేదని నమ్ముతున్నాడట ఆ హీరో. దాంతో, ఇంకోసారి అదే హీరోయిన్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

వద్దు బాబోయ్.. అంటూ, ఆ హీరోతో సినిమా తలపెట్టిన నిర్మాణ సంస్థ నెత్తీ నోరూ బాదుకుంటోందిట. మెయిన్ హీరోయిన్ కాకపోయినా, సినిమాలో ఇంపార్టెంట్ రోల్ అట సదరు హీరోయిన్‌ది.

ఏమో, ఆ హీరోయిన్‌లో ఆ హీరోకి ఏ టాలెంట్ నచ్చిందోగానీ.. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది టాలీవుడ్ వర్గాల్లో. వాస్తవానికి, టాలెంటెడ్ యాక్ట్రెస్.. సినిమా ప్రమోషన్లకీ బాగా సహకరిస్తుందామె.