ఈ డైరెక్టర్ మహేష్ తో సినిమా తీస్తా అంటున్నాడు , ఫ్యాన్స్ కి మామూలు హ్యాపీ కాదు.

మహేష్ బాబు త్వరలో సర్కారు వారి పాట సినిమాతో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాడు. యంగ్ డైరెక్టర్ పరశురాం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందించబోతున్నాడు. 14 రీల్స్ ప్లస్ .. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ తో కలిసి జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. సంక్రాంతి తర్వాత హైదరాబాద్ లో వేసిన భారీ బ్యాంక్ సెట్ లో సర్కారు వారి పాట మొదలవబోతోంది. నెలరోజులకి పైగానే ఈ షెడ్యూల్ జరగనుందని సమాచారం.

ఇక ఈ షెడ్యూల్ ని కంప్లీట్ చేసి చిత్ర బృందం అమెరికాలో 45 రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం వెళ్ళనున్నారు. దాదాపు ఏప్రిల్ వరకు సర్కారు వారి పాట టాకీ పార్ట్ కంప్లీట్ చేసేలా మహేష్ బాబు పక్కా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ సినిమాని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయాల్సిన సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి ప్రస్తుతం ఎన్.టి.ఆర్ .. రాం చరణ్ లతో తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈ ఏడాది సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నప్పటికి ఖచ్చితంగా ఎప్పుడు రిలీజ్ అన్నది క్లారిటీ రావడం లేదు.

అంతేకాదు మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో సినిమా మొదలయ్యేసరికి 2022 వచ్చేస్తుందని అంటున్నారు. అందుకే మహేష్ బాబు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ గ్యాప్ లో మరో సినిమాని చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఈ క్రమంలోనే ఛలో .. భీష్మ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుమల కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే త్రివిక్రం, సుకుమార్, పూరి జగన్నాధ్ లాంటి సీనియర్ దర్శకులు .. ఇప్పటికే సూపర్ హిట్స్ ఉన్న వాళ్ళని కాదని వెంకీ కుడుమలతో సినిమా ఒకే చేస్తాడా అని కొందరు మాట్లాడుకుంటున్నారట. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మహేష్ బాబు స్వయంగా వెల్లడించాలి. ఒకవేళ నిజంగా మహేష్ బాబు .. వెంకీ కుడుముల తో సినిమా చేస్తే మాత్రం ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతారు.