అమాయకుడు చూపులతో అందరిని ఆకట్టుకున్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఈమె ఎవరో గుర్తుపట్టారా?

సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ఎంతో మంది సెలబ్రిటీలు వారి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను అభిమానులు షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కనుక్కోండి అంటూ ఇలాంటి ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తెలుపు రంగు గౌను ధరించి ఎంతో అమాయకపు చూపులు చూస్తూ అందరిని ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించారు. అయితే ఈమె ప్రస్తుతం స్టార్ హీరోకి సతీమణిగా ఉండటమే కాకుండా పెళ్లయిన తర్వాత ఎన్నో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరి ఈ చిన్నారి ఎవరు గుర్తుపట్టారా…అదేనండి అక్కినేని హీరో అఖిల్ హీరోగా నటించిన మొదటి చిత్రం నటించిన అఖిల్ సినిమాలో అఖిల్ సరసన నటించిన హీరోయిన్ సయేషా సైగల్. ఈమె తెలుగులో అఖిల్ సినిమాలో మాత్రమే నటించారు ఈ సినిమా పెద్దగా ఆదరణ పొందకపోవడంతో పూర్తిగా తెలుగు తెరకు దూరమయ్యారు.

ఇకపోతే ఈమె కన్నడ తమిళం హిందీ భాషలలో కూడా వరుస సినిమాలలో నటించారు ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే ఈమె కోలీవుడ్ నటుడు ఆర్యన్ ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి స్థిరపడ్డారు. అయితే పెళ్లి చేసుకున్నప్పటికీ ఈమె వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె తన చిన్నప్పటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.