Home Entertainment సాయేషాను ఎంపిక చేసింది అతడేనట!?

సాయేషాను ఎంపిక చేసింది అతడేనట!?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కి మంచి క్రేజ్‌ ఉంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలు మంచి విజయాలు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీరి కాంబోలో రూపొందుతున్న సినిమాలో మరో కథానాయికను ఎంపిక చేశారు.

Sayesha Saigal
Sayesha Saigal

అఖిల్‌ సరసన ‘అఖిల్‌’ సినిమాలో నటించిన సాయేషా త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనబోతోందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో తొలుత ప్రజ్ఞా మార్టిన్‌, పూర్ణను కథానాయికలుగా ఎంపిక చేశారు. అలాగే కొన్ని సన్నివేశాలను సైతం చిత్రీకరించారు.

అయితే బాలయ్య, ప్రజ్ఞా మార్టిన్‌ జోడీగా సరిగా నప్పలేదని భావించిన చిత్ర బృందం ఆమె స్థానంలో సాయేషాని ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా రంగంలోకి దించేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

బాలయ్య బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేసిన బిబి3 రోరింగ్‌ టీజర్‌, అందులోని బాలయ్య డైలాగులు చెప్పిన తీరు అందరినీ ఫిదా చేసింది. గతంలో వీరి కాంబోలో వచ్చిన  చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో లేటెస్ట్‌ సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ద్వారకా క్రియేషన్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సాయేషాను బాలయ్యే ఎంపిక చేశాడని యూనిట్ అంతా చెప్పుకుంటోంది. 

- Advertisement -

Related Posts

వరుణ్ తేజ్ బాక్సింగ్.. స్పెషల్ అప్డేట్ రెడీ!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా రోజులయ్యింది. చివరగా 2019లో గద్దల కొండ గణేష్, F2 సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న వరుణ్ ఆ తరువాత...

ప్రభాస్, యష్ కాంబో.. కొంచెం చూడండి బయ్యా

బాహుబలితో సెట్ చేసిన ఒక బిగ్గెస్ట్ రికార్డుతో ప్రభాస్ పాన్ ఇండియా అనే దారిని మరింత పెద్దది చేయగా KGF చాప్టర్ 1తో యష్ కూడా మరో దారిని సెట్ చేశాడు. ఇటీవల...

మాస్ రాజా కోసం ప్రభాస్ టీమ్

క్రాక్ సినిమాతో మొత్తానికి ఒక పవర్ఫుల్ హిట్ అందుకున్నాడు రబితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ఆ సినిమా కరోనా లాక్ డౌన్ తరువాత భారీ సక్సెస్ ను అందుకున్న మొదటి సినిమాగా...

మెడపై చేతులేసి పట్టేసుకుంది.. అషూ రెడ్డి రాహుల్ రచ్చ

రాహుల్ సిప్లిగంజ్ అషూ రెడ్డిల వ్యవహారం ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. బిగ్ బాస్ మూడో సీజన్‌ నడిచినప్పుడు ఆ ఇంట్లో ఈ ఇద్దరూ క్లోజ్ కాదు....

Latest News