బిగ్ రివీల్ : “జవాన్” లో ఉంది ఈ స్టార్ హీరోనే అట.!

ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ అండ్ ఫస్ట్ హిట్ ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం బాలీవుడ్ కింగ్ ఖాన్ హీరో షారుక్ ఖాన్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “పఠాన్”. మరి బాలీవుడ్ రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం ఈ ఏడాదిలో మొదటి 1000 కోట్ల చిత్రంగా అయితే నిలిచింది.

ఇక ఈ సినిమా హిట్ తో అయితే నెక్స్ట్ షారుఖ్ ఖాన్ నటించిన భారీ చిత్రాలు అన్నింటిపై కూడా ఇప్పుడు పఠాన్ ని మించి హైప్ ఉంది. అయితే ఈ చిత్రాల్లో ఈ ఏడాది రిలీజ్ కి రాబోతున్న రెండో చిత్రమే “జవాన్”. అయితే సౌత్ అండ్ నార్త్ ఫిలిం టీం కలిసి చేస్తున్న ఈ భారీ చిత్రంపై కూడా మంచి హైప్ నెలకొంది.

ఇక ఈ చిత్రాన్ని తమిళ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా విషయంలో గత కొన్నాళ్ల నుంచి క్రేజీ టాక్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఓ స్టేర్ హీరో ఈ చిత్రంలో సాలిడ్ క్యామియో లో కనిపిస్తాడని టాక్ రాగా దానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అలాగే ఇప్పటికే అట్లీ తో పోలీసోడు, బిగిల్, అదిరింది లాంటి భారీ హిట్స్ చేసిన హీరో విజయ్ పేరు కూడా వచ్చింది.

అయితే అల్లు అర్జున్ టీం నుంచి ఓ క్లారిటీ రాగ ఇక నెక్స్ట్ అంతా విజయ్ ఉన్నాడని అనుకున్నారు. అయితే దీనిపై ఇప్పుడు సరైన క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో కనిపించేది విజయ్ నే అట. దీనిని ఈ చిత్రంపై వర్క్ చేసిన ఏక్షన్ కొరియోగ్రాఫర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. విజయ్ నే ఈ సినిమాలో ఉంటాడని దీనితో అయితే బిగ్ ఎలిమెంట్ పీడీ సినిమాపై రివీల్ అయ్యింది. ఇంకా అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాని షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థే నిర్మించగా ఈ సెప్టెంబర్ 7న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.