Pawan Kalyan: వకీల్ సాబ్ సినిమాలో పవన్ కల్యాణ్ గారికి మందు తీసుకురావడానికి ఆఫ్ డే మొత్త పని చేశానని ఆర్టిస్ట్ సమ్మెట గాంధీ అన్నారు. ఆఫ్ డే సీన్ చేస్తున్నారంటే ఎంత సేపుంటుందో అనుకున్నా కానీ, ఒక 5,6 సెకన్స్ మాత్రమే ఉందని ఆయన చెప్పారు. కానీ ఆ సీన్ కోసం దాదాపు ఆఫ్ డే పరిగెత్తించారు అని ఆయన చెప్పుకొచ్చారు. వినోద్ గారు తాను పరిగెత్తుతుంటే చూసి, పిలిచి గాంధీ గారు అసలు మీ వయసెంత అని అడిగారని, దానికి తను సమాధానంగా ఒరిజినల్ ఏజ్ చెప్పాలా లేదంటే, సినిమాలో ఏజ్ చెప్పాలా అని సరదాగా అన్నట్టు ఆయన చెప్పారు. ఏడు పదులున్నాయా అని అడిగితే, హా ఉన్నాయని చెప్పినట్టు ఆయన తెలిపారు.
ఇంత స్టామినా ఎలా మీకు అని తనకు ఆయన అడిగితే, నేను మార్నింగ్ వాకింగ్ బాగా చేస్తాను సర్, డైట్ కంట్రోల్ చేసి, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటానని సమాధానం చెప్పే సరికి, ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారని గాంధీ చెప్పారు. ఇక ఆ పరిగెత్తే సీన్ చేసిన రాత్రి మాత్రం కాళ్ల నొప్పులు రావడం అనేది సహజమేనని, కొబ్బరి నూనెతో మర్దనా చేసుకుని పడుకుంటానని, తప్పదు కదా మరి అని ఆయన సమాధానమిచ్చారు.
అంతకు ముందు ఒక దిక్సూచి అనే దాంట్లో షూట్ చేసేటపుడు ఒక తాడు కట్టి, 40 అడుగుల పైకి, కిందకు లేపడం లాంటివి చాలా సీన్లలో తాను ఫేస్ చేసినవేనని ఆయన చెప్పారు. కానీ తాను అలాంటివాటికి అస్సలు భయపడనని, చాలా ధైర్యంతో చేస్తానని ఆయన దృఢంగా చెప్పారు. వకీల్ సాబ్ సినిమా తర్వాత తాను ఎక్కడికెళ్లినా అందరూ గుర్తు పడుతున్నారని, ఫొటోలు తీసుకుంటున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.