హమ్మయ్య సంక్రాంతికి ఆ సినిమా రావడం లేదట.. లేదంటే కొంపలు మునిగేవి ..?

బాహుబలి రేంజ్ క్రేజ్ అండ్ పాపులారిటి సంపాదిచుకున్న సినిమా కేజీయఫ్ చాప్టర్ 1. ఈ సినిమాతో కన్నడ రాకింగ్ స్టార్ గా యష్, డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ స్టార్ అయ్యారు. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మీద ఎంత క్రేజ్ ఉందో “కేజీయఫ్ చాప్టర్ 2” మీద అదే రేంజ్ క్రేజ్ నెలకొంది. ఇక ఈ సినిమాలో యష్ జంటగా శ్రీనిధి శెట్టి నటిస్తొంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ అధీరా గా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

K.G.F: Chapter 2' actor Yash is all praises for Sanjay Dutt, who plays  Adheera in the film

కాగా దేశ వ్యాప్తంగా “కేజీయఫ్ చాప్టర్ 2” మీద భారీ స్థాయి అంచనాలనుప్పటికి కరోనా కారణంగా ఈ సినిమాకి అనుకున్న ప్లాన్స్ అన్ని తారుమారయ్యాయి. అయితే ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికి మేకర్స్ నుంచి మాత్రం పక్కా క్లారిటీ రావడం లేదు. కాగా కొద్ది పాటి బ్యాలెన్స్ షూటింగ్ ని కంప్లీట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు.

ఈ క్రమంలోనే సంజయ్ దత్ మీద పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నారు. అయితే ఈ రిలీజ్ విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. లాక్ డౌన్ కారణంగా సంక్రాంతి సీజన్ లో “కేజీయఫ్ చాప్టర్ 2” రిలీజ్ చేస్తారన్న టాక్ ఉండింది. కాని అప్పటి వరకు సినిమా రెడీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదన్నది తాజా సమాచారం. కుదిరితే ఆ సమయానికి టీజర్ మాత్రమే రిలీజ్ చేస్తారన్న మాట వినిపిస్తుంది.

అయితే ఇది మంచిదే అని అంటున్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో దిగేందుకు చాలా సినిమాలు సిద్దమవుతున్నాయి. అసలు అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందన్నది కూడా ఇప్పుడే చెప్పలేము అంటున్నారు. థియోటర్స్ కి జనాలు వచ్చే ధైర్యం చేస్తారా అన్నది ఇంకా సందేహంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత భారీ సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదన్న వాళ్ళు ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.