గాసిప్స్ : “NBK108″లో బాలయ్య, శ్రీ లీల పాత్రలివే.?

ఇప్పుడు నందమూరి నటసింహ నందమూరి బాలయ్య హీరోగా శృతి హాసన్ హీరోయిన్ ఓ భారీ ఫ్యాక్షన్ డ్రామా వీరసింహా రెడ్డి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా బాలయ్య కెరీర్ లో 107 వ సినిమా కాగా నెక్స్ట్ అయితే బాలయ్య తన కెరీర్ 108వ సినిమాని దర్శకుడు అనీల్ రావిపూడి తో ప్లాన్ చేశారు.

ఇక ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాని ఓ పక్కా ఏక్షన్ ఎంటర్టైనర్ గా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా యంగ్ హీరోయిన్ శ్రీ లీల కనిపిస్తుంది అని కొన్ని రూమర్స్ వినిపించాయి. అయితే ఏజ్ గ్యాప్ లో చాలా మంది ఇక్కడ ఆలోచనలో పడ్డారు.

అయితే ఇప్పుడు దీనిపై లేటెస్ట్ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరో బాలకృష్ణ హీరోయిన్ శ్రీ లీల కనిపిస్తారు కానీ ఇద్దరు జంట కాదట. బాలయ్య మరియు శ్రీ లీల లు తండ్రి కూతుళ్లుగా కనిపిస్తారని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల టాక్. బాలయ్య మిడిల్ ఏజ్ తండ్రిగా కనిపించనుండగా ఈ యంగ్ హీరోయిన్ తన కూతురుగా అయితే కనిపిస్తుందట.

సో ఈ ఇద్దరు స్టార్స్ ఈ పాత్రల్లో అయితే ఈ సినిమాలో కనిపించనున్నారు. మరి ఈ సినిమాకి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నటుడు శరత్ కుమార్ తదితరులు ఆల్రెడీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అలాగే షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.