గత ఆరుదశబ్దలుగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నేడు ఉదయం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. కైకాల మరణంతో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. హీరోగా,విలక్షణ నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించిన కైకాల కళామతల్లి నుంచి సెలవు తీసుకున్నారు.అయితే ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించినట్లు అందరికీ తెలిసింది. అయితే ఈయన మరణానికి గల కారణాలను కూడా ఈయన సోదరుడు నాగేశ్వరరావు వెల్లడించారు.
ఈ సందర్భంగా కైకాల సోదరుడు మాట్లాడుతూ కైకాల సత్యనారాయణ గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈయన గత ఏడాది కోవిడ్ బారిన పడ్డారు.ఈ సమయం నుంచి ఈయన మరింత అనారోగ్య సమస్యలకు గురయ్యారని అప్పటినుంచి హాస్పిటల్ లోనూ అలాగే ఇంటిలోనే తనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారని తెలిపారు.అయితే ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి నేడు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈయన చనిపోయారని తన సోదరుడు నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఇక ఈయనకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కాగా ఒకరు మాత్రమే చెన్నైలో ఉన్నారని మిగిలిన ముగ్గురు హైదరాబాదులో ఉన్నారని తెలిపారు.ఇక విదేశాల నుంచి కూడా కొందరు బంధుమిత్రులు వస్తున్నారని అందుకోసమే ఈయన అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం మహాప్రస్థానంలో జరగనున్నట్లు తెలిపారు.ఇక ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు ఈయన పార్టీవ దేహాన్ని సందర్శించి తనకు నివాళులు అర్పించారు ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం కైకాలమరణ వార్త స్పందించి ఆయ నివాళులు అర్పించడమే కాకుండా ఈయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు.