“సింహాద్రి” ఇండస్ట్రీ హిట్ అయితే ఇవి కూడా ఇండస్ట్రీ హిట్సే అట.!

టాలీవుడ్ లో ఉన్నటువంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో ఇప్పటికీ కూడా పెద్ద మిస్టరీ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది జూనియర్ ఎన్టీఆర్ నటించిన “సింహాద్రి” అనే చెప్పాలి. ఈ సినిమా ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి తప్ప ఇక ఏ  ఫ్యాన్స్ అంతెందుకు ఇండస్ట్రీ లోనే కొంతమంది ఇండస్ట్రీ హిట్ అంటే కాదు అని అంటారు.

అయినప్పటికీ ఇప్పటికీ కూడా సింహాద్రి చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్ అనే అంటున్నారు. ఇక లేటెస్ట్ గా అయితే ఈ మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా సింహాద్రి 4కే వెర్షన్ ని రీ రిలీజ్ కి సిద్ధం చేస్తూ నిన్న భారీ అనౌన్సమెంట్ ఇచ్చారు. దీనితో ఇక్కడ కూడా “ఇండస్ట్రీ హిట్” అంటూ ట్యాగ్ ని వైరల్ చేస్తుండగా.

ఇక ఇతర హీరోల ఫ్యాన్స్ ఈ సినిమా గాని ఇండస్ర్టీ హిట్ అయితే మా హీరోల సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్సే అని అంటున్నారు. పవన్ నటించిన గుడుంబా శంకర్ కూడా రీ రిలీజ్ కి సిద్ధం చేస్తుండగా ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్టే అని అలాగే మరోపక్క మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా “చిరుత” కూడా ఇండస్ట్రీ హిట్టే అని అంటున్నారు.

దీనితో కానీ సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే మా సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ సినిమాలే అని వారి అభిప్రాయం దీనితో మొత్తానికి సింహాద్రి ఇంత పని చేసింది. ఇక ఈ సినిమాకి అయితే రాజమౌళి దర్శకత్వం వహించగా భూమిక హీరోయిన్ గా నటించింది. అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.