Gallery

Priyanka Khera, Priyanka Khera pics, Priyanka Khera latest pics, Priyanka Khera stills, Priyanka Khera gallery, Priyanka Khera hot pics, Priyanka Khera images, Priyanka Khera...
Garima Chaurasia, Garima Chaurasia pics, Garima Chaurasia latest stills, Garima Chaurasia gallery, Garima Chaurasia hot pics, Garima Chaurasia new pics, Garima Chaurasia stills, actress,...
Helly Daruwala, Helly Daruwala pics, Helly Daruwala hot pics, Helly Daruwala stills,Helly Daruwala gallery,Helly Daruwala new pics, Helly Daruwala hottest stills, Helly Daruwala images,...
Mokshitha Pai, Mokshitha Pai pics, Mokshitha Pai new pics, Mokshitha Pai stills, Mokshitha Pai gallery, Mokshitha Pai images, Mokshitha Pai latest stills, sandelwood, actress ...
Nandita Swetha, Nandita Swetha pics, Nandita Swetha latest pics, Nandita Swetha stills, Nandita Swetha hot pics, Nandita Swetha new pics, Nandita Swetha photos, Nandita...
Akshara Haasan, Akshara Haasanlatest pics, Akshara Haasan gallery, Akshara Haasan hottest pics, Akshara Haasan new pics, Akshara Haasan stills, Akshara Haasan images, actress, kollywood,...
Home News అఖిల్ కెప్టెన్ కాకుండా అడ్డుపడిన మోనాల్... ఇద్దరి మధ్య ముద్దులాట పోయి గుద్దులాట?

అఖిల్ కెప్టెన్ కాకుండా అడ్డుపడిన మోనాల్… ఇద్దరి మధ్య ముద్దులాట పోయి గుద్దులాట?

బిగ్ బాస్-76 వ రోజు : కమాండో ఇన్‌స్టిట్యూట్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌లు పూర్తిచేసి స్టార్లు పొందిన అఖిల్, అభిజీత్, హారిక కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. వీళ్లకు మళ్లీ కెప్టెన్సీ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా.. కెప్టెన్సీ పోటీదారులు ముగ్గురూ ఇంటి సభ్యులను ఒప్పించి వారి భుజాల మీద కూర్చోవాలి. చివరి వరకు ఏ సభ్యుడు అయితే కిందికి దిగకుండా భుజాల మీద ఉంటారో ఆ సభ్యుడు ఈ టాస్క్‌లో విజేతగా నిలవడంతో పాటు ఇంటి కెప్టెన్ అవుతారు.ఎత్తుకున్న తరవాత బాక్సులో నుంచి బయటికి వచ్చినా, భుజం మీద ఉన్న పోటీదారుడు కిందికి దిగినా పోటీ నుంచి తప్పుకోవాలి. ఈ టాస్క్‌లో భాగంగా అవినాష్ భుజంపైకి అభిజీత్, సోహెల్ భుజంపైకి అఖిల్, మోనాల్ భుజంపైకి హారిక ఎక్కారు. టాస్క్ ప్రారంభం కావడానికి ముందు అఖిల్‌కు సోహెల్ మాటిచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో కిందికి దించనని, ధైర్యంగా ఉండాలని అఖిల్‌కు సూచించాడు. కానీ.. సోహెల్ వల్ల కాలేదు.

Bigg Boss Captaincy Task
bigg boss captaincy task

మొదట అభిజీత్‌ను మోయలేక అవినాష్ కిందికి దించేశాడు. ఆ తరవాత సోహెల్ చాలా ఓపిక పట్టినా తన వల్ల కాలేదు. అఖిల్‌కు కిందికి దించేశాడు. దీంతో హారిక విజేతగా నిలిచింది. హారికను తన భుజాలపై ఎత్తుకుని ఆనందంతో మోనాల్ పరుగులు పెట్టింది. ఈ టాస్క్‌లో గెలిచి హౌస్ కొత్త కెప్టెన్‌గా దేత్తడి హారిక ఎంపికైంది. దీంతో అఖిల్ తన దగ్గర ఉన్న కెప్టెన్ బ్యాడ్జీని హారికకు ఇవ్వాల్సి వచ్చింది. చాలా రోజుల తరవాత ఒక అమ్మాయి బిగ్ బాస్ హౌజ్ కెప్టెన్ కావడం విశేషం. అయితే, హారిక చేతిలో ఓడిపోవడం అఖిల్‌కు ఆగ్రహం తెప్పించింది. అందులోనూ హారికను మోనాల్ గెలిపించడం అఖిల్‌కు మింగుడు పడలేనట్టుంది.

అఖిల్ స్లీపింగ్ రూమ్‌లో తన బాధని సోహెల్‌తో పంచుకున్నాడు. అఖిల్‌కు సోహెల్ సారీ చెప్పాడు. ‘‘నాది అన్నట్టుగానే ఆడాను కానీ నడుం పట్టేసుకుంది. ఇవన్నీ పక్కనపెడితే, మోనాల్ ఇంకో 10 నిమిషాలు ఉంటది. ఆమె ఫిక్స్ అయిపోయింది’’ అని అఖిల్‌తో సోహెల్ అన్నాడు. మొత్తం మీద వీళ్లిద్దరూ ఒకరినొకరు హత్తుకుని అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతలో హారిక లడ్డూలు పట్టుకుని వీళ్ల దగ్గరికి వచ్చింది. అఖిల్‌తో లడ్డూ తినిపించింది.

There Was A Clash Start Between Akhil And Monal In Biggboss 4 Telugu
akhil vs monal

హారికతో పాటు అక్కడికి మోనాల్ కూడా వచ్చింది. ఆమెను సోహెల్.. ‘‘నువ్వు ఇంకో 10 నిమిషాలు ఉండేదానివి కదా’’ అని అడిగాడు. దీనికి మోనాల్.. ‘‘ఆమె నాపై నమ్మకం ఉంచింది’’ అని సమాధానం ఇచ్చింది. ఆ తరవాత అఖిల్ దగ్గరకు వెళ్లి హగ్ చేసుకోవడానికి ప్రయత్నించింది.కానీ మంటెక్కి ఉన్న అఖిల్ ఇష్టంలేనట్లుగానే హగ్ చేసుకున్నాడు.మోనాల్ అక్కడి నుంచి వెళ్లిపోగానే అఖిల్ కోపంగా తన చేతిని కప్‌బోర్డుకి చాచి కొట్టుకున్నాడు.

- Advertisement -

Related Posts

చంద్రబాబు ఈసారెలా తప్పించుకుంటారు చెప్మా.?

  మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కాస్సేపట్లో ఆంధ్రపదేశ్ పోలీసుల నుంచి నోటీసులు అందుకోనున్నారు. వారం రోజుల్లోగా ఆయన ఆ నోటీసులకు సమాధానం చెప్పాల్సి వుంటుందట. చెప్పకపోతే ఏం చేయాలన్నదానిపై...

కరోనా సునామీ: యువ భారతాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు.?

కరోనా వైరస్ రెండో వేవ్.. యువతరాన్ని చిదిమేస్తోంది. మధ్యవయస్కులూ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వృద్ధులకు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి కరోనా వైరస్ వల్ల ఎక్కువ ప్రమాదం వాటిల్లే అవకాశం...

సమన్యాయం: నిన్న చంద్రబాబుపైన.. నేడు లోకేష్ పైన.!

నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపైన కర్నూలులో ఓ కేసు నమోదైన విషయం విదితమే. తప్పుడు సమాచారంతో కరోనా వైరస్ విషయంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు...

Latest News