ఫ్యాన్స్ కోరుకోవడం లో తప్పులేదు.. టన్నుల్లో ఊన్న పవర్ స్టార్ క్రేజ్ అలాంటిది ..!

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్.. ఈ పేరు వింటేనే అందరికీ వైబ్రేషన్స్ వస్తాయి. టాప్ స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా పవన్ క్రేజే సపరేటు. భారీ ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక స్టార్ పవన్ అనడంలో ఏమాత్ర అతిశయోక్తి లేదు. ప్రస్తుతం రాయకీయాలపై క్రియా శీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ… అభిమానుల అండదండలు ఎప్పుడు ఆయన వెంటే ఉంటాయి. అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల కారణంగా రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ …తన అభిమానుల కోసం మళ్లీ వరసగా సినిమాలను కమిటయిన సంగతి తెల్సిందే.

కానీ తన లుక్స్‌ పరంగా ఇంప్రెస్ చేయలేకపోతున్నారని పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు తెగ ఫీల్ అవుతున్నారట. ఒకప్పుడు తెలుగు తెరకు స్టైల్ కు పరిచయం చేసిన పవన్ తన లుక్స్‌ పై దృష్టి సారించడం లేదన్న టాక్ టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. ఒవైపు రాజకీయాలు…మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న పవన్…అభిమానులను అలరించేందుకు మళ్లీ ఫిట్ అవుతానని తెగ వర్కౌట్‌లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సన్నగా స్టైలిష్‌గా ఉండే పవన్‌ కళ్యాణ్ కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమా తరువాత కాస్త బొద్దుగా మారిపోయారు.

ఆ సినిమా తర్వాత నుంచి పవన్ లుక్స్‌లో మార్పులు కూడా వచ్చాయి. అత్తారింటికి దారేది.. గోపాల గోపాల .. సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు చూస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఒకప్పటి పవన్‌కు ఇప్పటి పవన్‌కు చాలా తేడా ఉందంటూ అభిమానులే అనుకుంటున్నారట. దీంతో తన ఫాన్స్‌ను ఎంకరేజ్‌ చేసే విధంగా తన లుక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు పవన్. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయంటున్నారు. ప్రస్తుతం వకీల్‌సాబ్ చిత్రీకరణలో పవన్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే క్రిష్‌, హరీశ్ శంకర్‌లతో సిసిమాలు చేయనున్నట్లు పవన్ ప్రకటించారు. రీసెంట్‌గా మరో కొత్త ప్రాజెక్టుకు పవన్ ఓ చెప్పారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో నటించనున్నారు.